Rajahmundry: నేతాజీ స్ఫూర్తితో పోరాటానికి సిద్ధం కావాలి: మేడా శ్రీనివాస్
Rajahmundry: రాజమండ్రి ఆర్పీసీ కార్యాలయంలో ఆజాద్ హింద్ ప్రభుత్వ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నేతాజీ స్ఫూర్తితో పోరాడాలని పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
Rajahmundry: నేతాజీ స్ఫూర్తితో పోరాటానికి సిద్ధం కావాలి: మేడా శ్రీనివాస్
రాజమండ్రి: నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక (ఆర్పీసీ) అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాజమండ్రిలోని ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ, 1943 అక్టోబర్ 21న నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చారిత్రక ఘట్టాన్ని ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీతో పాటు ఎందరో భారతీయులు చేసిన త్యాగాలు, పోరాటాలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నేతాజీ సాగించిన పోరాటం దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో నేతాజీ పాత్రకు తగిన గుర్తింపు లభించాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహిళలు, పురుషులు, వివిధ వర్గాల ప్రజల త్యాగాలను యువత గుర్తించుకోవాలని సూచించారు.
దేశభక్తి, లౌకిక స్ఫూర్తి, ఐక్యతతో దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేతాజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డి.వి. రమణమూర్తి, పెండ్యాల కామరాజు, లంక దుర్గాప్రసాద్, బర్ల ప్రసాద్, దుడ్డే త్రినాథ్, ఎం.డి. హుస్సేన్, మేడిచర్ల శ్రీనివాసరావు, సిమ్మా దుర్గారావు, దోషి నిషాంత్, కొల్లి సత్యనారాయణ, గుడ్ల సాయి దుర్గాప్రసాద్, ఎస్.కె. దేవి, పిట్టా శ్రీనివాసరావు, పసుపులేటి సుశీల, కాకర ప్రసాద్, ఖండవల్లి వీర్రాజు, రాయి భవాని తదితరులు పాల్గొన్నారు.




