Amalapuram: బీసీలంటే టీడీపీ.. టీడీపీ అంటేనే బీసీలు: ఎమ్మెల్యే ఆనందరావు
Amalapuram: అమలాపురంలో నిర్వహించిన బీసీ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొని కూటమి ప్రభుత్వంలో బీసీలకు జరిగిన న్యాయాన్ని వివరించారు.
Amalapuram: బీసీలంటే టీడీపీ.. టీడీపీ అంటేనే బీసీలు: ఎమ్మెల్యే ఆనందరావు
Amalapuram: నాడు అన్న ఎన్టీ రామారావు నుండి నేడు చంద్రబాబునాయుడు,లోకేష్ ల వరకు బీసీలకు గుర్తింపు లభిస్తుంది ఈ కూటమి ప్రభుత్వంలోనే బీసీలకు అసలైన న్యాయం అని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు.వైసీపీ హయాంలో బీసీల గొంతు కోశారు మిశ్రా కమిషన్ ద్వారా బీసీలకు రక్షణ కల్పించిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వంమే అని ఎమ్మెల్యే ఆనందరావు కొనియాడారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను 100% గెలిపించుకుంటాం అని అమలాపురం బీసీల నాయకులు శపథం చేశారు అని ఎమ్మెల్యే అన్నారు.అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి బీసీ సోదరుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. అమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి సుమారు 600 మందికి పైగా బీసీ సోదరులు,బిసి కుల సంఘాల ప్రతినిధులు,పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఎన్టీ.రామారావు క్షేత్రస్థాయిలో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించి నాయకత్వాన్ని ప్రోత్సహించారని,ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రిజర్వేషన్లను కోర్టులు కొట్టివేసిన 34 శాతానికి పెంచి బీసీలకు చారిత్రాత్మక రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తున్నారని గుర్తుచేశారు.
నేడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,యువనేత,మంత్రి నారా లోకేష్ మరియు కూటమి ప్రభుత్వంలో బీసీల సంక్షేమం, రాజకీయ సాధికారత కోసం నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. "బీసీలంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే బీసీలు" అని ఆయన ఉద్ఘాటించారు.త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా దక్కాల్సిన 34 శాతం రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం పూర్తి కసరత్తు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
గతంలో వైసీపీ ప్రభుత్వం బీసీల గొంతు కోసిందని,కోర్టుల్లో సరైన వాదనలు వినిపించకుండా బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.కానీ కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పులను గౌరవిస్తూనే,బీసీలకు అత్యధిక మేలు జరిగేలా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సులను కేబినెట్లో ఆమోదించిందని తెలిపారు.
చట్టపరమైన రక్షణ కల్పిస్తూనే, కొన్ని కేటగిరీలలో తగ్గినచోట కూటమి పార్టీల పరంగా అదనపు సీట్లను కేటాయించి మొత్తం 34 శాతం రిజర్వేషన్ల ఫలాలను బీసీలకు అందిస్తామని స్పష్టం చేశారు.గ్రామ వార్డు మెంబర్లు,సర్పంచ్లు, ఎంపీటీసీలు,జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు,మేయర్ పదవుల్లో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
బీసీల అభ్యున్నతికి, సంక్షేమానికి (వడ్డెర్లకు మైనింగ్ లీజులు,గీత కార్మికులకు ఎక్సైజ్ షాపులు,సెలూన్లకు ఉచిత విద్యుత్,రజక,నాయీ బ్రాహ్మణులకు ఆర్ధిక భృతి వంటివి) కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని బలపరుస్తూ,పోటీ చేసే ప్రతి బీసీ అభ్యర్థిని 100 శాతం భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీలో,స్థానిక సంస్థల్లో తిరుగులేని విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పాల్గొన్న బీసీ నాయకులు అందరూ రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం ఐకమత్యంగా సైనికులా పని చేస్తామని ఎమ్మెల్యే ఆనంద్ రావు సమక్షంలో తీర్మానించారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బిసి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




