Malikipuram: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు బట్టెలంక విద్యార్థులు

Malikipuram: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన బట్టెలంక జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు శాంతి కిరణ్, దివ్యలను ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది.

PRABHU, RAZOLE
Published on: 5 Oct 2026 7:26 PM IST
Malikipuram
X

Malikipuram: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు బట్టెలంక విద్యార్థులు

మలికిపురం: అథ్లెటిక్స్‌లో సత్తా చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన బట్టెలంక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నల్లి శాంతి కిరణ్, అమలాదాసు దివ్యలను రాజోలు నియోజకవర్గ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను ప్రోత్సహిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత రాణించగలరని పేర్కొన్నారు. కష్టపడి సాధన చేసి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పాఠశాల, తల్లిదండ్రులు, గ్రామానికి గర్వకారణమన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ విజయభేరి మోగించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం హనుమంతరావు, ఎస్సీ వెల్ఫేర్ అధ్యక్షులు పొలమూరి శ్యామ్, ప్రధాన కార్యదర్శి రాపాక మహేష్, నాయకులు సరేళ్ల విజయ్ ప్రసాద్, తాడి సహదేవ్, కలగత బుల్లియ్య, నల్లి శివకుమార్, రాపాక లక్ష్మణ్, పాలపర్తి ప్రసాద్, దైవజనులు రాజశేఖర్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎడ్ల బాపూజీ, వైస్ చైర్మన్ ఏ. సుప్రియ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE