Rajole: రాజోలులో వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్.. ఖాతాదారులు అప్రమత్తం!

Rajole: యూఎఫ్‌బీయూ సమ్మె మరియు వరుస సెలవుల నేపథ్యంలో ఈనెల 26 నుండి 30 వరకు ఐదు రోజుల పాటు బ్యాంకు సేవలకు అంతరాయం.

PRABHU, RAZOLE
Published on: 21 Sept 2026 1:47 PM IST
Rajole
X

Rajole: రాజోలులో వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్.. ఖాతాదారులు అప్రమత్తం!

Rajole: బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఈనెల వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకు సేవలకు అంతరాయం కలగనుంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈనెల 28, 29, 30 తేదీల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. అంతకుముందు 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో మొత్తం ఐదు రోజుల పాటు బ్యాంకు శాఖలు మూసి ఉండనున్నాయి.

దీంతో ఖాతాదారులు నగదు జమ, ఉపసంహరణ, చెక్కుల క్లియరెన్స్ తదితర బ్యాంకింగ్‌ అవసరాలను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించారు. అత్యవసర లావాదేవీల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎంలు, యోనో, యూపీఐ వంటి డిజిటల్ సేవలను వినియోగించుకోవచ్చని బ్యాంకు అధికారులు తెలిపారు.

వరుస సెలవులు, సమ్మె కారణంగా బ్యాంకు పనులు వాయిదా పడే అవకాశం ఉన్నందున ప్రజలు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే ఏటీఎంలలో నగదు లభ్యత, డిజిటల్ లావాదేవీల పరిస్థితులు బ్యాంకును బట్టి మారే అవకాశం ఉంది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE