Kothapeta: కొత్తపేట నియోజకవర్గానికి రూ.1.02 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు!
Kothapeta: కొత్తపేట నియోజకవర్గానికి రూ.1,02,39,451 విలువైన 219 సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే .
Kothapeta: కొత్తపేట నియోజకవర్గానికి రూ.1.02 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు!
Kothapeta: కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని నిరుపేద, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థిక భరోసా కల్పించేందుకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేసిన కృషి ఫలితంగా ఈ నెల ఎనిమిదవ తేదీ నాటికి నియోజకవర్గానికి మొత్తం 219 సీఎంఆర్ఎఫ్ చెక్కులు, రూ.1,02,39,451 /- (ఒక కోటి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఒకటి రూపాయల) ఆర్థిక సహాయం అందింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ నిధులు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అర్హులైన బాధితులకు ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
మండలాల వారీగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల వివరాలు
1. ఆత్రేయపురం మండలం: 58 చెక్కులు — రూ.29,91,257
2. రావులపాలెం మండలం: 63 చెక్కులు — రూ.31,74,565
3. కొత్తపేట మండలం: 62 చెక్కులు — రూ.24,18,689
4. ఆలమూరు మండలం: 36 చెక్కులు — రూ.16,54,940
మొత్తం: 219 చెక్కులు — రూ.1,02,39,451.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు, సహాయ నిధులు అందేలా కృషి కొనసాగిస్తానని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు.




