Ainavilli: అయినవిల్లి మండలంలో అర్నబ్ తుఫాన్ బీభత్సం!

Ainavilli: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో అర్నబ్ తుఫాన్ బీభత్సం. వీచిన ఈదురుగాలులకు నేలమట్టమైన ఇళ్లు, కూలిన విద్యుత్ స్తంభాలు.

RAJU, P GANNAVARAM
Published on: 29 Oct 2026 12:05 PM IST
Ainavilli
X

Ainavilli: అయినవిల్లి మండలంలో అర్నబ్ తుఫాన్ బీభత్సం!

Ainavilli: అయినవిల్లి మండలం లోని పలు గ్రామాల్లో తుఫాన్ ప్రభావంతో వీచిన గాలులకు పలు ఇల్లు నేలకొరిగాయి. ముందస్తుగా విలస గ్రామంలో ఒక ఇంట్లో ఉంటున్నవారు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో కొన్ని ఇల్లు పూర్తిగా నేలమట్టమవడం కాగా.. మరికొన్ని ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

తుఫాను ప్రభావంతో ఇల్లు కోల్పోయిన బాధితులు తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మరికొన్ని ఇల్లు పాక్షికంగా దెబ్బతిని ఇల్లు పైకప్పులు పగిలిపొయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో కోనసీమలోని గ్రామాలు ఇంకా అంధకారం లోనే బిక్కు బిక్కు మంటన్నారు ఇక్కడ ప్రజలు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM