Mamidikuduru: 26వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె.. మామిడికుదురులో వినూత్న నిరసన!

Mamidikuduru: మామిడికుదురులో 26వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె. తమ సమస్యలు పరిష్కరించాలని కనకదుర్గమ్మ ఫొటోకు వినతిపత్రం సమర్పించి వినూత్న నిరసన.

PRABHU, RAZOLE
Published on: 11 Oct 2026 1:32 PM IST
Mamidikuduru
X

Mamidikuduru: 26వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె.. మామిడికుదురులో వినూత్న నిరసన!

Mamidikuduru: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 26 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు ఆదివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ‘దుర్గమ్మా.. కరుణించమ్మా.. మా సమస్యలు పరిష్కారమయ్యేలా చూడు’ అంటూ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురులోని మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

సమ్మె శిబిరంలో కనకదుర్గమ్మ ఫొటోను ఏర్పాటు చేసి, అమ్మవారికి వినతిపత్రం సమర్పించారు. తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వానికి సద్బుద్ధిని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నారు. 26 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.

తమను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించి తగిన నిర్ణయం తీసుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE