Palagummi: పాలగుమ్మిలో పెళ్లి వేడుకకు హాజరైన జస్టిస్ బట్టు దేవానంద్

Palagummi: కోనసీమ జిల్లా రాజోలు మండలం పాలగుమ్మిలో జరిగిన వివాహ వేడుకకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

PRABHU, RAZOLE
Published on: 7 Oct 2026 5:07 PM IST
Palagummi
X

Palagummi: పాలగుమ్మిలో పెళ్లి వేడుకకు హాజరైన జస్టిస్ బట్టు దేవానంద్

పాలగుమ్మి: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పాలగుమ్మి గ్రామంలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన వివాహ వేడుకకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. వధువు కుటుంబం తరఫున వివాహ వేడుకలో పాల్గొన్న ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు.

నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని జస్టిస్ బట్టు దేవానంద్ ఆకాంక్షించారు. అనంతరం వివాహ వేడుకకు హాజరైన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పలకరించారు.

జస్టిస్ బట్టు దేవానంద్ కుటుంబ సభ్యులతో కలిసి వివాహ వేడుకకు హాజరుకావడంతో అక్కడ సందడి నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వివాహ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా కొనసాగింది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE