Rajahmundry: వైఎస్సార్‌సీపీకి యాదవ సామాజికవర్గం అండగా నిలవాలి!
Rajahmundry: యాదవ సామాజికవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని బీసీ స్టేట్ మహిళా అధ్యక్షురాలు అనూ యాదవ్ పిలుపునిచ్చారు.
Rajahmundry:వైఎస్సార్‌సీపీకి యాదవ సామాజికవర్గం అండగా నిలవాలి..
రాజముండ్రి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, పార్టీ బలోపేతానికి యాదవ సామాజికవర్గం తరఫున తన వంతు కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, బీసీ స్టేట్ మహిళా అధ్యక్షురాలు అనూ యాదవ్ తెలిపారు.
ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జగనన్న చేపట్టిన ఓదార్పు యాత్ర నుంచి ఆయన వెంట నడుస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నామని తెలిపారు. యాదవ సామాజికవర్గం తరఫున పార్టీ అభ్యర్థుల విజయానికి సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు.




