Antarvedi: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవలకు సాంప్రదాయ వస్త్రధారణ నిబంధన

Antarvedi: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అక్టోబర్ 11 నుంచి సుదర్శన హోమం, అభిషేకాలలో పాల్గొనే భక్తులకు సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి చేశారు.

PRABHU, RAZOLE
Published on: 1 Oct 2026 7:01 PM IST
Antarvedi
X

Antarvedi: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవలకు సాంప్రదాయ వస్త్రధారణ నిబంధన

అంతర్వేది: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో నిర్వహించే శ్రీ సుదర్శన హోమం, నిత్యాభిషేకం, విశేష అభిషేకం తదితర సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ అధికారులు సూచించారు.

ఈ మేరకు 2026 అక్టోబర్ 11వ తేదీ నుంచి సాంప్రదాయ దుస్తులు ధరించిన భక్తులను మాత్రమే ఆయా సేవల్లో పాల్గొనేందుకు అనుమతించనున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ నాగ వర ప్రసాద్ తెలిపారు. ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

కావున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సేవల్లో పాల్గొనే భక్తులు ముందుగానే ఈ విషయాన్ని గమనించి, తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి రావాలని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కోరారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE