Antarvedi: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆశీర్వాద దీపం

Antarvedi: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆశీర్వాద దీపాలను వెలిగించారు.

PRABHU, RAZOLE
Published on: 17 Sept 2026 8:03 PM IST
Antarvedi
X

Antarvedi: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆశీర్వాద దీపం

అంతర్వేది: భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో గురువారం సాయంత్రం ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు.

సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ గారు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సంపూర్ణ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో దేశానికి మరింత సేవలందించాలని ఆకాంక్షిస్తూ అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో ఆశీర్వాద దీపాలను వెలిగించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కోసం స్వామివారిని ప్రార్థించారు. దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి, దేశ ప్రగతి కోసం ఆయన చేస్తున్న సేవలను నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమికి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE