Antarvedi: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొత్త డ్రెస్ కోడ్ అమలు!
Antarvedi: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం నుండి కొత్త డ్రెస్ కోడ్ అమలు. విశేష పూజలు, అభిషేకాలకు సంప్రదాయ దుస్తులు తప్పనిసరి అని ఈవో వెల్లడి.
Antarvedi: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొత్త డ్రెస్ కోడ్ అమలు!
Antarvedi: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆలయంలో నిర్వహించే సుదర్శన హోమం, నిత్యాభిషేకం,ఇతర ప్రత్యేక అభిషేక సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ ఈవో ఎం.కె.టి.వి. ప్రసాద్ తెలిపారు.
మగవారు పంచె, కండువా ధరించాలని, మహిళలు చీర, జాకెట్ లేదా చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్ ధరించాలని సూచించారు. ముఖ్యంగా సుదర్శన హోమం, నిత్యాభిషేకం, ఇతర ప్రత్యేక అభిషేక సేవల్లో పాల్గొనే భక్తులకు ఈ డ్రెస్ కోడ్ తప్పనిసరిగా అమలవుతుందని స్పష్టం చేశారు.
నిర్దేశించిన దుస్తుల నిబంధనలు పాటించే భక్తులను మాత్రమే ఆయా ప్రత్యేక పూజలు, సేవల్లో పాల్గొనేందుకు అనుమతిస్తామని ఈవో వెల్లడించారు. స్వామివారి ఆలయ పవిత్రతను, సంప్రదాయాలను కాపాడటంలో భాగంగా భక్తులు ఈ నిబంధనలకు సహకరించాలని ఆలయ అధికారులు సూచించారు.




