Antarvedi: అంతర్వేది ఆలయ హుండీ ఆదాయం రూ.27.59 లక్షలు
Antarvedi: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ హుండీలను లెక్కించగా 56 రోజులకు రూ.27.59 లక్షల ఆదాయం వచ్చినట్లు అసిస్టెంట్ కమీషనర్ ప్రసాద్ తెలిపారు.
Antarvedi: అంతర్వేది ఆలయ హుండీ ఆదాయం రూ.27.59 లక్షలు
అంతర్వేది: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, అంతర్వేదిలో బుధవారం హుండీలను తెరిచి లెక్కించారు. 56 రోజుల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని లెక్కించగా మొత్తం రూ.27,59,307 ఆదాయం వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్ కమీషనర్ M.K.T.N.V. ప్రసాద్ తెలిపారు.
ఈ సందర్భంగా 12-08-2026 నుంచి 07-10-2026 వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా ప్రధాన ఆలయ హుండీల ద్వారా రూ.26,77,326, గుర్రలక్క అమ్మవారి హుండీ ద్వారా రూ.12,545, అన్నదానం హుండీల ద్వారా రూ.69,436 ఆదాయం లభించింది. మొత్తంగా రూ.27,59,307 ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
అలాగే శ్రీ స్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయ హుండీల ద్వారా రూ.29,915 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
దేవాదాయశాఖ అమలాపురం తనిఖీదారు J. రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది హుండీలను తెరిచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. హుండీ లెక్కింపు ప్రక్రియను అధికారులు, ఆలయ సిబ్బంది సమక్షంలో నిర్వహించారు.




