Antarvedi: పల్లిపాలెంలో దసరా వేడుకలు: సరస్వతీ దేవిగా కనకదుర్గమ్మ!

Antarvedi: అంతర్వేది పల్లిపాలెం కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. 6వ రోజు అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

PRABHU, RAZOLE
Published on: 16 Oct 2026 2:15 PM IST
Antarvedi
X

Antarvedi: పల్లిపాలెంలో దసరా వేడుకలు: సరస్వతీ దేవిగా కనకదుర్గమ్మ!

Antarvedi: అంతర్వేది పల్లిపాలెం: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు ఆరో రోజు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా ఉదయం నుంచే గంగపుత్రులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం అధిక సంఖ్యలో మత్స్యకార కుటుంబాలు ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు పొందుతూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE