Mulikipalli: గర్భిణులకు సీమంతం, పౌష్టికాహార ప్రాముఖ్యతపై అధికారులు అవగాహన!
Mulikipalli: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ములికిపల్లిలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం. గర్భిణులకు సీమంతం, పౌష్టికాహారంపై అవగాహన కల్పించిన అధికారులు.
Mulikipalli: గర్భిణులకు సీమంతం, పౌష్టికాహార ప్రాముఖ్యతపై అధికారులు అవగాహన!
Mulikipalli: గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం లోని ములికిపల్లి గెద్దాడ వారి గ్రూపు లోని అంగన్వాడీ కేంద్రంలో సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ ఉత్సవం, పోషణ మాసం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం నిర్వహించి, తల్లి, బిడ్డ ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
తృణధాన్యాలు, ఆకుకూరలు, పౌష్టికాహార వంటకాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. రోజువారీ ఆహారంలో పోషక విలువలున్న పదార్థాలను చేర్చుకోవాలని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.




