Mamidikuduru: నగరంలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవ్: పోషకాహార ప్రదర్శన
Mamidikuduru: కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరంలో అంగన్‌వాడీ ఉత్సవ్ వేడుకలు ఘనంగా జరిగాయి. పోషకాహార ప్రదర్శన ఏర్పాటు చేసి, సిబ్బందిని సత్కరించారు.
Mamidikuduru: నగరంలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవ్: పోషకాహార ప్రదర్శన
మామిడికుదురు: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మామిడికుదురు మండలం నగరం పితాని వారి మెరక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం అంగన్వాడీ ఉత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నగరం మాజీ సర్పంచ్ జాలెం రమణకుమారి హాజరై అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నగరం సెక్టార్ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నందున, స్థల సేకరణ చేపట్టి సొంత భవనాలు నిర్మించాలని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు భైరిశెట్టి రామకృష్ణ కోరారు. పదో తరగతి ఫలితాల్లో నగరం హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు జాలెం సుబ్బారావు కోరారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహార కిట్లను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూపర్‌వైజర్ రామలక్ష్మి సూచించారు. అనంతరం నగరం సెక్టార్ పరిధిలో సేవలందిస్తున్న అంగన్వాడీ సిబ్బందిని రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పూలు, పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, పౌష్టికాహార కిట్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కూనపురెడ్డి సురేష్‌కుమార్, నన్నేశా హుస్సేన్, వి. దుర్గారావు, రాయుడు ఆనందరావు, అంగన్వాడీ టీచర్లు హేమలత, సుజాత, అరుణకుమారి, మంగాదేవి, అరుణ, సత్యశ్యామల, గుబ్బల సత్యదుర్గ తదితరులు పాల్గొన్నారు.




