Kothapeta: వాడపాలెం వైభవంగా అంగన్వాడీ ఉత్సవ్, పోషణ మాసం!

Kothapeta: కొత్తపేట ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వాడపాలెం కాపు కల్యాణ మండపంలో నిర్వహించిన 'అంగన్వాడీ ఉత్సవ్ - పోషణ మాసం' వేడుకలకు బండారు కమలారాణి, శ్రీనివాస్ హాజరయ్యారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 3 Oct 2026 1:59 PM IST
Kothapeta
X

Kothapeta: వాడపాలెం వైభవంగా అంగన్వాడీ ఉత్సవ్, పోషణ మాసం!

Kothapeta: గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఐసీడిఎస్ అధికారులు తెలిపారు.సేవా సంకల్ప అభియాన్,ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ 25 సంవత్సరాల ప్రజాసేవ పూర్తి చేసుకొన్న సందర్భంగా వాడపాలెం కాపు కళ్యాణ మండపంలో శనివారం కొత్తపేట ఐసిడిఎస్ పరిధిలో అంగన్వాడి ఉత్సవ్, పోషణ మాసం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సతీమణి కమలారాణి, కొత్తపేట జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. గర్భిణీలు, చిన్నారులు, బాలింతలకు ఆరోగ్య సూత్రాలు పాటించడంపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.

తల్లి, పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. తృణధాన్యాలు, ఆకుకూరలు, పౌష్టికాహార వంటకాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది.

ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ గజలక్ష్మి, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA