Amalapuram: జాతీయ పవర్ లిఫ్టింగ్‌లో అమలాపురం యువకుడికి 6 పతకాలు
Amalapuram: ఢిల్లీలో జరిగిన జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో అమలాపురానికి చెందిన రాగిరెడ్డి శ్రవణ్ కుమార్ ఏకంగా 6 పతకాలు సాధించి రికార్డు సృష్టించారు.
Amalapuram: జాతీయ పవర్ లిఫ్టింగ్‌లో అమలాపురం యువకుడికి 6 పతకాలు
Amalapuram: అమలాపురంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే కఠినమైన సాధనతో జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో అమలాపురానికి చెందిన యువకుడు సత్తా చాటాడు.ఏకంగా ఆరు పతకాలు సాధించి ఉభయ తెలుగు రాష్ట్రాల పేరును జాతీయ స్థాయిలో మారుమోగించాడు.
అమలాపురం పట్టణానికి చెందిన రాగిరెడ్డి శ్రవణ్ కుమార్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు.ఉద్యోగంతో పాటు ప్రతిరోజూ ఉదయం,సాయంత్రం క్రమం తప్పకుండా శిక్షణ పొందుతూ పవర్ లిఫ్టింగ్ పోటీలకు సిద్ధమయ్యారు.
ఢిల్లీలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో నిర్వహించిన WPSO, WPC జాతీయ ఛాంపియన్‌షిప్ పోటీల్లో శ్రవణ్ కుమార్ వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచారు. మొత్తం ఆరు పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు.సాధించిన పతకాలు ఇలా ఉన్నాయి.
1. ఎక్స్‌ట్రీమ్ బైసెప్ కర్ల్ - స్వర్ణం
2. ఎక్స్‌ట్రీమ్ ఓవర్‌హెడ్ ప్రెస్ -స్వర్ణం
3. స్ట్రిక్ట్ బైసెప్ కర్ల్ -రజతం
4. స్ట్రిక్ట్ ఓవర్‌హెడ్ ప్రెస్ -రజతం
5. బెంచ్ ప్రెస్ (స్లింగ్‌షాట్) - రజతం
6. WPC డెడ్‌లిఫ్ట్ -కాంస్యం
67 కేజీల విభాగంలో డెడ్‌లిఫ్ట్‌లో 162.5 కేజీల బరువును ఎత్తి కాంస్య పతకం సాధించడం విశేషం.తన విజయానికి సహకరించిన లూసిడ్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి, కంపెనీ డైరెక్టర్లు యుగంధర్, చెల్లారావుతో పాటు తన సహోద్యోగులకు శ్రవణ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఉద్యోగం చేస్తూనే జాతీయ స్థాయిలో ఆరు పతకాలు సాధించిన శ్రవణ్ కుమార్‌ను క్రీడాభిమానులు, ప్రముఖులు,గ్రామస్తులు తదితరులు అభినందించారు.




