Amalapuram: 24వ రోజుకు చేరిన వీఆర్ఏల రిలే నిరాహార దీక్ష - సంఘీభావం
Amalapuram: అమలాపురంలో వీఆర్ఏల రిలే నిరాహార దీక్ష 24వ రోజుకు చేరింది. వైయస్సార్‌సీపీ నాయకులు పాల్గొని వారి డిమాండ్లకు సంపూర్ణ సంఘీభావం తెలిపారు.
Amalapuram: 24వ రోజుకు చేరిన వీఆర్ఏల రిలే నిరాహార దీక్ష - సంఘీభావం
అమలాపురం: నేలబావిలో పడిన మూడు నెలల పాపను రక్షించిన ఫైర్ సిబ్బంది డివిజన్ కేంద్రంలోని చిన్నబల్లంకి వీధి నేలబావిలో పడిపోయిన మూడు నెలల పసిపాపను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రక్షించారు. చిన్న బల్లంకి వీధిలో మూడు నెలల పాప ప్రమాదవశాత్తు నేలబావిలో పడిపోయింది. ఈ ఘటనతో ఆందోళనకు గురైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సహాయక చర్యలు చేపట్టి పాపను రక్షించారు.
సమయస్ఫూర్తితో స్పందించి పసిపాపను కాపాడిన ఫైర్ సిబ్బందిని స్థానికులు అభినందించారు. చిన్నారి క్షేమంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.ప్రమాద సమయంలో వెంట24వ రోజుకు చేరిన వీఆర్ఏల రిలే నిరాహార దీక్ష.
VRA లకు వైఎస్సార్‌సీపీ నాయకుల సంఘీభావం తెలియజేసారు.గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెలో భాగంగా 24వ రోజు అయిన అమలాపురంలో రిలే నిరాహార దీక్షను కొనసాగించారు.ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై వీఆర్‌ఏల పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. అమలాపురం నియోజకవర్గ అసెంబ్లీ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ సమ్మెలో పాల్గొని వీఆర్‌ఏలకు తమ మద్దతు తెలిపారు.వీఆర్‌ఏల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి,వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
గత 24 రోజులుగా వీఆర్‌ఏలు తమ సమస్యల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో శాంతియుత నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన లేకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెలకు కేవలం రూ.10,500 గౌరవ వేతనంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని, పెరుగుతున్న నిత్యావసర ధరల నేపథ్యంలో వీఆర్‌ఏల ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని నాయకులు కోరారు.వీఆర్‌ఏలకు పే స్కేల్ అమలు చేయాలని,అర్హులైన వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించాలని,నామినీ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వీఆర్‌ఏలను క్రమబద్ధీకరించాలని, వీఆర్‌ఏల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గ్రామస్థాయిలో ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న వీఆర్‌ఏల సేవలను గుర్తించి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు,వంటెద్దు వెంకన్నాయుడు,ఎస్.ఈ.సి. సభ్యులు కుడిపూడి భరత్, పట్టణ అధ్యక్షులు సంసాని నాని,మాజీ జెడ్పీటీసీ పందిరి శ్రీహరి,మాజీ మున్సిపల్ ఛైర్మన్ సత్యనాగేంద్ర మణి,రాష్ట్ర విద్యార్థి విభాగ కార్యదర్శి మద్ధింశెట్టి ప్రసాద్,రాష్ట్ర ఇంటెలెక్చువల్ విభాగ కార్యదర్శి రాజు గారు,విద్యార్థి విభాగ రీజనల్ కోఆర్డినేటర్ జిల్లెల రమేష్ ,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర , జిల్లా ఐటీ విభాగ అధ్యక్షులు తోరం గౌతమ్ ,రాష్ట్ర,జిల్లా, నియోజకవర్గ,మండల,వార్డు స్థాయి నాయకులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొని వీఆర్‌ఏలకు సంఘీభావం తెలిపారు.నే స్పందించి పసిపాపను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది సేవలను పలువురు ప్రశంసించారు.




