Amalapuram: జీవీ మాల్ ఆక్రమణలో పబ్లిక్ రోడ్డు: వీసీకే నేత బొంతు రమణ

Amalapuram: అమలాపురం గడియార స్తంభం వద్ద మున్సిపల్ రోడ్డును జీవీ మాల్ నిర్వాహకులు ఆక్రమించి పార్కింగ్ పెట్టారని వీసీకే నేత బొంతు రమణ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

SURESH, AMALAPURAM
Published on: 28 Sept 2026 7:51 PM IST
Amalapuram
X

Amalapuram: జీవీ మాల్ ఆక్రమణలో పబ్లిక్ రోడ్డు: వీసీకే నేత బొంతు రమణ

Amalapuram: అమలాపురం గడియారస్తంభం వద్ద ఉన్న జీవి (GV) షాపింగ్ మాల్ నిర్వాహకులు మున్సిపల్ రోడ్డును ఆక్రమించి పార్కింగ్ ఏర్పాటు చేయడం వల్ల నిత్యం తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలుగుతోందని,దీనికి కారణమైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విముక్తి చిరుతల పార్టీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ డిమాండ్ చేశారు.

ఈ మేరకు సమస్య తీవ్రతను వివరిస్తూ జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు.​ప్రజల ప్రధాన రహదారిపై జీవి మాల్ అక్రమ ఆక్రమణ.​గడియారస్తంభం వద్ద మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు,ప్రజలు ప్రత్యామ్నాయంగా ఈ జీవి మాల్‌ను ఆనుకుని ఉన్న రోడ్డులోనే ఎక్కువగా సంచరిస్తుంటారు.అంతేకాకుండా,ఈ రోడ్డు ద్వారానే ప్రజలు వివిధ బ్యాంకులకు,పోలీస్ స్టేషన్‌కు,అలాగే ప్రధాన పోస్ట్ ఆఫీస్‌కు రాకపోకలు సాగిస్తుంటారు.

అమలాపురం పట్టణం లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండడం రోడ్డు లను వెడల్పు చేయాల్సింది పోయి ఉన్న రోడ్డు ను కూడా షాపింగ్ మాల్ నిర్వాహకులు ఆక్రమించుకున్నా మున్సిపల్ అధికారులు గాని ట్రాఫిక్ పోలీస్ వారు గాని పట్టించుకోవడం లేదు ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ మున్సిపల్ రోడ్డును జీవి మాల్ నిర్వాహకులు అక్రమంగా ఆక్రమించి,తమ మాల్ బైక్ పార్కింగ్‌గా మార్చేశారు.దీనితో పాటు స్థానిక వ్యాపారులు పోస్టుఆఫీస్ ఆనుకుని ఆక్రమించడం తో పోస్ట్ ఆఫీస్ కు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ ఆక్రమణల వల్ల పోస్ట్ ఆఫీస్ సేవలకే కాకుండా,బ్యాంకులకు, వెళ్లే ప్రజలకు తీవ్ర విఘాతం కలుగుతోందని తెలిపారు.జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి,అమలాపురం మున్సిపల్ కమిషనర్ వారికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.జీవి మాల్ అక్రమ బైక్ పార్కింగ్‌ను,రోడ్డును ఆక్రమించిన పండ్ల దుకాణాలను శాశ్వతంగా తొలగించి,ప్రజల రాకపోకలకు సహకరించాలని బొంతు రమణ కలెక్టర్ కు పిర్యాదు చేశారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM