Amalapuram: నల్లా స్వామికి నాలుగు దశాబ్దాల నిరీక్షణ.. పదవి దక్కేనా?
Amalapuram: టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీనే నమ్ముకున్న అమలాపురం సీనియర్ నేత నల్లా స్వామికి మున్సిపల్ కో-ఆప్షన్ పదవైనా దక్కుతుందా అన్నది కోనసీమలో ఆసక్తికరంగా మారింది.
Amalapuram: నల్లా స్వామికి నాలుగు దశాబ్దాల నిరీక్షణ.. పదవి దక్కేనా?
అమలాపురం: రాజకీయాల్లో కొందరు నాయకులు పదవుల కోసం పార్టీలు మారుతుంటే. మరికొందరు పదవులు దక్కకపోయినా పార్టీనే నమ్ముకుని నిరంతరం పనిచేస్తుంటారు. ఈ రెండో కోవకు చెందిన నాయకుడే అమలాపురం టీడీపీ సీనియర్ నేత నల్లా స్వామి. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు పసుపు జెండానే నమ్ముకుని ఆయన రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నారు.
అయితే నాలుగు దశాబ్దాలకు పైగా పార్టీ కోసం పనిచేసినా అధికారిక పదవులు మాత్రం ఆయనకు అందని ద్రాక్షగానే మిగిలాయి.ఆరుసార్లు అధికారంలోకి వచ్చినా నిరాశే.టీడీపీ రాష్ట్రంలో పలుమార్లు అధికారంలోకి వచ్చిన సందర్భాల్లో ఎంతో మంది నాయకులకు నామినేటెడ్,ఇతర అధికారిక పదవులు దక్కాయి.
పార్టీ కోసం నిరంతరం శ్రమించిన నల్లా స్వామికి మాత్రం ఇప్పటి వరకు ఆ అవకాశం దక్కలేదు.పార్టీ పదవులు, బాధ్యతలు నిర్వహిస్తూ కార్యకర్తలకు అండగా నిలిచిన ఆయన.అధికారిక గుర్తింపు కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడిగా సేవలు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నల్లా స్వామి గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.
పార్టీ బలోపేతానికి తనదైన శైలిలో కృషి చేశారు. అమలాపురం రాజకీయాల్లో మాజీ మంత్రి,దివంగత మెట్ల సత్యనారాయణకు అత్యంత ఆప్తుడిగా, ప్రాణమిత్రుడిగా వ్యవహరించారు. మెట్ల సత్యనారాయణ వెన్నంటే ఉంటూ పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన మరణానంతరం రాజకీయ వారసుడిగా కొనసాగుతున్న మెట్ల కుటుంబానికి కూడా నల్లా స్వామి తన మద్దతును కొనసాగిస్తూ వచ్చారు.
ఈసారైనా కో-ఆప్షన్ పదవి వరించేనా అని ఆయన తన భావోద్వేగాన్ని వ్యక్తపరిచారు.ప్రస్తుతం అమలాపురం మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుడి పదవిపై నల్లా స్వామి ఆశలు పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాలుగు దశాబ్దాల పార్టీ సేవలు, సీనియార్టీ, మెట్ల కుటుంబంతో సాన్నిహిత్యం,పార్టీ పట్ల ఆయనకున్న విధేయతను పరిగణనలోకి తీసుకుని ఈసారి అవకాశం కల్పిస్తారనే ప్రచారం ఊపందుకుంది.
నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరపడేనా అని ఆయన అన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీనే నమ్ముకుని ప్రయాణం సాగిస్తున్న నల్లా స్వామికి అమలాపురం మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడి పదవి ద్వారా అయినా అధికారిక గుర్తింపు లభిస్తుందా అని పార్టీ అధిష్టానం ఆయన సేవలకు తగిన గౌరవం ఇస్తుందా అన్నది ఇప్పుడు అమలాపురం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.సీనియర్ నాయకుడికి ఈసారైనా సముచిత స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు,పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.




