Amalapuram: అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా నందిక శ్రీనివాసు నియామకం

Amalapuram: అమలాపురం కోర్టుల ఏజీపీగా సీనియర్ అడ్వకేట్ నందిక శ్రీనివాసు నియామకం. మూడేళ్ల పాటు కొనసాగనున్న ఆయనకు బార్ అసోసియేషన్ సభ్యుల శుభాకాంక్షలు.

SURESH, AMALAPURAM
Published on: 17 Sept 2026 6:49 AM IST
Amalapuram
X

Amalapuram: అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా నందిక శ్రీనివాసు నియామకం

అమలాపురం: అమలాపురంలోని పలు కోర్టులకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజి పీ)గా సీనియర్ అడ్వకేట్ నందిక శ్రీనివాసును నియమిస్తూ న్యాయశాఖ ద్వారా అధికారిక ఉత్తర్వులు (జి.ఓ.ఆర్. టీ.నెంబర్.261) జారీ చేసింది.

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి కోర్టు, 14వ అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, అడిషనల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులలో ప్రభుత్వం తరపున సివిల్ కేసులను వాదించడానికి ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.

ఈ నియామకం పట్ల అమలాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాశి శేషారావు,ముమ్మిడివరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు రామాయణం మనేశ్వరరావు, పలువురు సీనియర్,జూనియర్ న్యాయవాదులు,న్యాయవాద గుమస్తాలు,కోర్టు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ నందిక శ్రీనివాసుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నందిక శ్రీనివాసు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఏపీపీగా ఎంపికకు సహకరించిన అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు, అమలాపురం పార్లమెంటు సభ్యులు జీఎం హరీష్ బాలయోగిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM