Amalapuram: కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్‌కు రూ.100 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం

Amalapuram: కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ భూసేకరణ కోసం రూ. 100 కోట్లు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిందని ఎంపీ గంటి హరీష్ బాలయోగి తెలిపారు.

SURESH, AMALAPURAM
Published on: 1 Oct 2026 7:30 PM IST
Amalapuram
X

Amalapuram: కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్‌కు రూ.100 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం

అమలాపురం: కోనసీమ రైల్వే ప్రాజెక్ట్ కు రాష్ట్ర వాటా 100 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం ఎంపీ హరీష్ బాలయోగి తెలియజేసారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ హరీష్ బాలయోగి కొనియాడారు.

పూర్వపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పరిధిలో కోటిపల్లి నరసాపురం మధ్య నిర్మించే బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ రోజు స్వర్గీయ జిఎంసి బాలయోగి జయంతి వేడుకల్లో పాల్గొన్న తనయుడు అమలాపురం పార్లమెంట్ సభ్యులు లోక్సభలో ప్రభుత్వ విప్పు గంటి హరీష్ బాలయోగి ప్రజల అర్షద్వానాల మధ్య ఈ ఈ ప్రకటన చేశారు మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 575 ను విడుదల చేసిన ఉత్తర్వులను మీడియాకు అందజేశారు.

దీంతో కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి అవరోధంగా మారిన భూసేకరణ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. గురువారం అమలాపురంలోని బాలయ్య ఘాట్లో బాలయోగి 75వ జయంతోత్సవాలు జరుగుతున్న సమయంలో ఎంపీ హరీష్ చేసిన ప్రకటనతో జిల్లా వాసుల్లో ఆనందాలకు అవధులు లేవు.సుమారు రెండున్నర దశాబ్దాల క్రితం నిర్మాణం చేపట్టిన కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ప్రాజెక్టు వయంలో 25% నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా అప్పట్లో ఒప్పందం జరిగింది.

అయితే గత వైసిపి ప్రభుత్వ హాయములో ఈ ప్రాజెక్టు అతి గతిని పట్టించుకోలేదు.ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కొట్టం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టుకు అవసరమైన రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయి.దీనిలో భాగంగా ప్రభుత్వం 100 కోట్లను బాలయోగి జయంతి రోజున విడుదల చేయటం తో బాలయోగి చేపట్టిన ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి మరోసారి రుజువయింది

కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ప్రక్రియ తోపాటు ఇతర సాంకేతిక పనులకు అవసరమైన నిధులు కేటాయింపుకు బడ్జెట్లో కేటాయించే విధంగా ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారని ఎంపీ హరీష్ బాలయోగి చెప్పారు.ఏపీ ప్రభుత్వం ఆర్థిక అవసరాలు మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సహాయ పథకం ఎస్ ఏ ఎస్ ఈ ఐ పథకం కింద మార్గదర్శకాలు పరిశీలించిన తర్వాత ప్రాజెక్టును తక్షణమే పునః ప్రారంభించి పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

రైల్వే శాఖతో కుదిరిన భూసేకరణ ఒప్పందం ప్రకారం సివిల్ భాగాల పనులు అన్నిటిని కలుపుకుని మొత్తం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం లో 25% వాటాను ప్రభుత్వం భరించడానికి సుముఖంగా ఉన్నట్టు ఆ ఉత్తరంలో ప్రభుత్వం స్పష్టం చేయటంతో ఇప్పటివరకు ఉన్న అవరోధాలు అన్ని క్లియర్ అయ్యాయి.ఇకపై భూసేకరణకై ఏ ఖర్చు అయినా రాష్ట్ర ప్రభుత్వమే భరించే విధంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.అందరికీ కృతజ్ఞతలు

రైల్వే ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 25 శాతం నిధులను కేటాయిస్తూ ఏపీ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఎంపీ హరీష్ బాలయోగి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఇందుకు సహకరించిన జనసేన అధినేత ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లకు ఎంపీ హరీష్ బాలయోగి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM