Amalapuram: ఈదరపల్లి దసరా ఊరేగింపులో పాల్గొన్న కూటమి యువనాయకులు!

Amalapuram: ఈదరపల్లి పవర్ స్ట్రీట్‌లో దసరా ఊరేగింపులో పాల్గొన్న కూటమి యువనాయకులు కరణ్, సత్య. దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు.

SURESH, AMALAPURAM
Published on: 26 Oct 2026 8:22 PM IST
Amalapuram
X

Amalapuram: ఈదరపల్లి దసరా ఊరేగింపులో పాల్గొన్న కూటమి యువనాయకులు!

Amalapuram: విజయదశమి వేడుకలలో భాగంగా అమలాపురం ఈదరపల్లి పవర్ స్ట్రీట్‌లో నిర్వహించిన దసరా ఊరేగింపు మహోత్సవంలో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తనయుడు,యువనాయకులు కరణ్ మరియు రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు తనయుడు సత్య పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు,స్థానిక ప్రజలు యువనాయకులకు ఘనస్వాగతం పలికారు.దసరా ఊరేగింపులో భక్తులతో కలిసి పాల్గొన్న కరణ్ మరియు సత్య

శ్రీ దుర్గాదేవి అమ్మవారి దివ్య ఆశీస్సులతో అమలాపురం నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు,అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తాటికాయల సుధీర్, బండారు నాయుడు కూటమి నాయకులు,కార్యకర్తలు మరియు స్థానిక భక్తులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM