Amalapuram: అమలాపురం 5వ వార్డులో హోరెత్తిన కూటమి యువనాయకుల ప్రచారం!

Amalapuram: అమలాపురం 5వ వార్డులో ఘనంగా కూటమి ఎన్నికల ప్రచారం. చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన యువనాయకులు కరణ్, సత్య.

SURESH, AMALAPURAM
Published on: 26 Oct 2026 8:10 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురం 5వ వార్డులో హోరెత్తిన కూటమి యువనాయకుల ప్రచారం!

Amalapuram: అమలాపురం పట్టణం 5వ వార్డులో ఘనంగా కూటమి ప్రచారం చైర్మన్ అభ్యర్థి,కౌన్సిలర్ అభ్యర్థిల గెలుపే లక్ష్యంగా యువనాయకులు హోరెత్తిన ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు.మీ అమూల్య మైన,పవిత్రమైన ఓటును గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజా అభ్యర్థన లు తెలియజేస్తున్నారు. యువనాయకులకు బ్రహ్మరథం పడుతూ హారతులతో స్వాగతం పలికిన వార్డు ప్రజలు.

అమలాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 5వ వార్డులో కూటమి శ్రేణుల ప్రచారం ఘనంగా సాగింది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నల్లా శ్రీధర్ మరియు వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కడలి పృథ్వి విజయం కోసం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తనయుడు అయితాబత్తుల కరణ్ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబులు తనయుడు మెట్ల సత్య సంయుక్తంగా విస్తృత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.యువనాయకులు కరణ్ మరియు సత్య ఇద్దరూ వార్డులోని ప్రతి ఇంటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం,అభివృద్దిని వివరిస్తూ, జనసేన అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ప్రచారానికి వచ్చిన యువనాయకులకు,కూటమి నేతలకు వార్డు మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు,జనసైనికులు,కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు అధికసంఖ్యలో సంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM