Amalapuram: అమలాపురం మున్సిపాలిటీకి ప్రతిష్టాత్మక స్కోచ్ జాతీయ అవార్డు
Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో 'స్కోచ్' అవార్డు. వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య మెరుగుదలకి గానూ పురస్కారం.
Amalapuram: అమలాపురం మున్సిపాలిటీకి ప్రతిష్టాత్మక స్కోచ్ జాతీయ అవార్డు
Amalapuram: అమలాపురం పురపాలక సంఘం జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని, గుర్తింపును సొంతం చేసుకుంది. పట్టణంలో చేపట్టిన సమీకృత వ్యర్థాల నిర్వహణ (Integrated Waste Management),పారిశుద్ధ్య మెరుగుదల కార్యక్రమాలకు గానూ అమలాపురం మున్సిపాలిటీకి ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ (SKOCH) జాతీయ అవార్డు లభించింది.న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అమలాపురం మున్సిపాల్ కమిషనర్ వి. నిర్మల్ కుమార్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తొలిసారిగా అమలాపురం మున్సిపాలిటీ పాల్గొని అవార్డు గెలుచుకోవడం విశేషం.పారిశుద్ధ్య నిర్వహణలో వినూత్న పద్ధతులు పాటించడంతో పాటు,ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ్య కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు గానూ ఈ జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది.
ఈ సందర్భంగా కమిషనర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ పురపాలక సిబ్బంది కృషి,ప్రజల భాగస్వామ్యం వల్లే ఈ పురస్కారం సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు.అమలాపురం పురపాలక సంఘానికి జాతీయ అవార్డు రావడం పట్ల స్థానిక ప్రజలు,అధికారులు, ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.




