Amalapuram: రేపే మున్సిపల్ ఫలితాలు.. ఎస్‌కేబీఆర్ కాలేజీలో ఓట్ల లెక్కింపు
Amalapuram: అమలాపురం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటలకు ఎస్‌కేబీఆర్ కళాశాలలో ప్రారంభం. 4 గదుల్లో 35 వార్డుల ఫలితాల లెక్కింపునకు అధికారుల ఏర్పాట్లు.
Amalapuram: రేపే మున్సిపల్ ఫలితాలు.. ఎస్‌కేబీఆర్ కాలేజీలో ఓట్ల లెక్కింపు
అమలాపురం: అమలాపురం ఎస్.కె.బి.ఆర్ కళాశాల లో రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కు నాలుగు రూమ్స్ ఎంపిక చేసిన అధికారులు.
మొదటి మూడు రూమ్ ల్లో నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేసి నాలుగు వార్డులుకు కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తారు.ఆ విధంగా తొలి విడత మూడు రూమ్ ల్లో నాలుగు వార్డులు వంతున 12 వార్డులు కౌంటింగ్ పూర్తి అవుతుంది.
ఆ విధంగా మూడు దఫా దాఫలుగా 35 వార్డుల కౌంటింగ్ పూర్తి అవుతుంది. నాలుగో రూమ్ లో ప్రత్యేకంగా 6 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఆ రూమ్ లో 6 విడతలుగా చైర్మన్ ఒట్లు లెక్కింపు చేస్తారు.




