Amalapuram: ఖతార్‌లో చిక్కుకున్న ఇద్దరు ఏపీ మహిళల సురక్షిత స్వదేశాగమనం

Amalapuram: ఖతార్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు మహిళలను సురక్షితంగా రప్పించిన అమలాపురం మైగ్రేషన్ మేనేజ్‌మెంట్ సెంటర్. కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలతో చర్యలు.

SURESH, AMALAPURAM
Published on: 2 Nov 2026 7:51 PM IST
Amalapuram
X

Amalapuram: ఖతార్‌లో చిక్కుకున్న ఇద్దరు ఏపీ మహిళల సురక్షిత స్వదేశాగమనం

అమలాపురం: విదేశాలకు ఉపాధి కోసం వెళ్లి వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయ మహిళలకు అండగా నిలుస్తూ, అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల,ఐఏఎస్ ఆదేశాల మేరకు అమలాపురం కలెక్టరేట్‌లోని మైగ్రేషన్ మేనేజ్‌మెంట్ సెంటర్ సమన్వయకర్త గోళ్ల రమేష్ తెలిపారుమరో ఇద్దరు మహిళలను సురక్షితంగా భారతదేశానికి రప్పించేందుకు కృషి చేసింది.

వివరాల్లోకి వెళితే, పశ్చిమగోదావరి జిల్లా ఐ. భీమవరం గ్రామానికి చెందిన తాటిపాక హవీల కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఉపాధి నిమిత్తం ఖతార్ దేశానికి వెళ్లారు.అయితే ఆమె ఖతార్‌కు వెళ్లి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ, తిరిగి స్వదేశానికి పంపకుండా అక్కడ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె సోదరుడు మైగ్రేషన్ మేనేజ్‌మెంట్ సెంటర్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

అదేవిధంగా,ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద ఎల్లమిల్లి గ్రామానికి చెందిన కోలుకుల నిర్మలకుమారి భర్త మరణించడంతో కుటుంబ పోషణ భారం ఆమెపై పడింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉపాధి కోసం ఖతార్ దేశానికి వెళ్లారు.అయితే అక్కడికి వెళ్లి రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ ఆమెను స్వదేశానికి పంపకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు మైగ్రేషన్ మేనేజ్‌మెంట్ సెంటర్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ రెండు ఫిర్యాదులపై స్పందించిన మైగ్రేషన్ మేనేజ్‌మెంట్ సెంటర్ అధికారులు,ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy,Qatar) మరియు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) అధికారులకు ఈ విషయాన్ని ఈ-మెయిల్స్ ద్వారా తెలియజేశారు.బాధిత మహిళల పరిస్థితిని వివరించి, వారిని సురక్షితంగా స్వదేశానికి పంపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మైగ్రేషన్ మేనేజ్‌మెంట్ సెంటర్ చేసిన సమన్వయ ప్రయత్నాలకు స్పందించిన భారత రాయబార కార్యాలయం అధికారులు జోక్యం చేసుకుని, అవసరమైన చర్యలు చేపట్టడంతో తాటిపాక హవీల మరియు కోలుకుల నిర్మలకుమారిలు సురక్షితంగా భారతదేశానికి తిరిగి చేరుకున్నట్లు మైగ్రేషన్ మేనేజ్‌మెంట్ సెంటర్ సమన్వయకర్త గోళ్ల రమేష్ తెలిపారు.

ఈ సందర్భంగా మైగ్రేషన్ మేనేజ్‌మెంట్ నోడల్ అధికారి శ్రీ వీర్ల సుబ్బారావు మాట్లాడుతూ,విదేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారు చట్టబద్ధమైన మార్గాలను అనుసరించాలని,విదేశాల్లో ఏవైనా సమస్యలు ఎదురైతే భయపడకుండా సంబంధిత అధికారులను లేదా మైగ్రేషన్ మేనేజ్‌మెంట్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రవాస భారతీయులకు సహాయం అందించడంలో జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కడియాల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM