Amalapuram: కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కు అందజేత
Amalapuram: అమలాపురంలో టీడీపీ కార్యకర్త ప్రభు కుమార్ కుటుంబాన్ని పరామర్శించి రూ. 5 లక్షల బీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే ఆనందరావు.
Amalapuram: కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కు అందజేత
అమలాపురం: మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రమాద బీమా కష్టకాలంలో కార్యకర్త కుటుంబానికి కొండంత అభయం ఇచ్చిన ఎమ్మెల్యే ఆనందరావు అమలాపురం పట్టణం 27వ వార్డు మార్కెట్ సమీపంలో తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు విశేష సేవలందించి అకాల మరణం చెందిన దివంగత కార్యకర్త ప్రభు కుమార్ భవిరిశెట్టి కుటుంబానికి అమలాపురం ఎమ్మెల్యే తెలుగు దేశం పార్టీ ప్రమాద భీమా పరిహార చెక్కును అందజేశారు.
టీడీపీ కార్యకర్తల సంక్షేమ విభాగం ద్వారా మంజూరైన రూ. 5,00,000/- (ఐదు లక్షల రూపాయల) చెక్కును ప్రభు కుమార్ నామినీ అయిన భవిరిశెట్టి వెంకట నరసమ్మ ఎమ్మెల్యే అందజేసి,ఆ కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక.
కష్టకాలంలో పార్టీ జెండాను భుజాన ఎత్తుకుని నడిచిన ప్రతి కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది.నారా లోకేష్ దూరదృష్టి, నాయకత్వంలో రూపుదిద్దుకున్న 'కార్యకర్తల సంక్షేమ నిధి' ఈరోజు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వేలాదిమంది కార్యకర్తల కుటుంబాలకు కొండంత అభయాన్ని, ఆర్థిక స్థైర్యాన్ని ఇస్తోంది.ప్రభు కుమార్ అకాల మరణం పార్టీకి తీరని లోటని,వారి కుటుంబం ఆత్మస్థైర్యంతో నిలబడేందుకు లోకేష్ అందించిన ఈ రూ.5లక్షల ఆర్థిక సాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
నాటి నుండి నేటి వరకు పార్టీ కోసం రక్తం చిందించిన కార్యకర్తలను, వారి కుటుంబాలను ఆదుకోవడంలో మంత్రి లోకేష్ చూపిస్తున్న చొరవ అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి అన్ని వేళలా పార్టీ మరియు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు,నాయకులు,ప్రజాప్రతినిధులు,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




