Amalapuram: 52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ పత్రాలు పంపిణీ

Amalapuram: అమలాపురంలో 52 మంది లబ్ధిదారులకు రూ.2.50 లక్షల చొప్పున హౌసింగ్ లోన్ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అందజేశారు.

SURESH, AMALAPURAM
Published on: 9 Oct 2026 6:42 PM IST
Amalapuram
X

Amalapuram: 52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ పత్రాలు పంపిణీ

అమలాపురం: ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల రుణం మంజూరు కూటమి ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నిజమైందని ఆనంద వ్యక్తం చేశారు.అమలాపురం పట్టణ పరిధిలో నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు పత్రాలను అందజేశారు.ఈ విడతలో 52 మందికి రూ. 2,50,000 చొప్పున రుణ మంజూరు పత్రాలు అందించగా, ఇప్పటివరకు మొత్తం 200 మందికి పైగా లబ్ధిదారులకు ఈ సహాయం అందించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.గత వైకాపా పాలనలో ఉండేందుకు పనికిరాని అగ్గిపెట్టె లాంటి ఇళ్లను,నీట మునిగే కాలనీల్లో సెంటు పావు స్థలాలిచ్చి పేదలను వంచించారని మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని నిరుపేదలను గుర్తించి, ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల వరకు బ్యాంక్ రుణాలు ఇప్పిస్తూ ఆసరాగా నిలుస్తున్నామని తెలిపారు. అమలాపురంలో ప్రతీ అర్హుడికి పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు శ్రమిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు,నాయకులు ప్రజాప్రతి నిధులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM