Amalapuram: అమలాపురంలో రూ.20 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన

Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద రూ.20 కోట్ల మున్సిపల్ HAM ప్రాజెక్టు కింద రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆనందరావు శంకుస్థాపన చేశారు.

SURESH, AMALAPURAM
Published on: 11 Oct 2026 7:21 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో రూ.20 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన

Amalapuram: గతంలో మంత్రులు,ఎమ్మెల్యేలు చేయలేని చారిత్రాత్మక అభివృద్ధిని చేసి చూపిస్తున్నాం అని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు.స్థానిక అమలాపురం పట్టణ రూపురేఖలను శాశ్వతంగా మార్చివేసేలా, ఆధునిక సదుపాయాలతో కూడిన భారీ మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే ఆనందరావు శ్రీకారం చుట్టారు.

మున్సిపల్ HAM (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) ప్రాజెక్టు కింద రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సెంట్రల్ డివైడర్ మరియు ఆధునిక విద్యుత్ దీపాలతో కూడిన సుందరమైన రోడ్డు విస్తరణ పనులకు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ఎమ్మెల్యే ఆనందరావు ఈ రోజు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా అమలాపురం పట్టణ పరిధిలోని సత్యనారాయణ గార్డెన్స్ నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు మరియు హై స్కూల్ సెంటర్ నుండి కాలేజీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ డివైడర్‌తో కూడిన రోడ్డు పనులను చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ గతంలో అమలాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మంత్రులుగానీ, ఎమ్మెల్యేలుగానీ పట్టణ సుందరీకరణపై,ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై కనీస దృష్టి సారించలేదు.వారు చేయలేని చారిత్రాత్మక అభివృద్ధిని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే మేము చేసి చూపిస్తున్నాం. పట్టణ ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ రూ. 20 కోట్లతో HAM‌ ప్రాజెక్టు ద్వారా డివైడర్లతో కూడిన రహదారుల విస్తరణతో నిర్మిస్తున్నాం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

అమలాపురం పట్టణ సమగ్ర వికాసానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు మరియు మంత్రివర్యులు పొంగూరు నారాయణ కి ఎమ్మెల్యే ఆనందరావు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కూటమి ప్రభుత్వ దూరదృష్టి, మున్సిపల్ మంత్రి వేగవంతమైన నిర్ణయాల వల్లే ఇంతటి భారీ నిధులు అమలాపురానికి సాధ్యమయ్యాయని కొనియాడారు.నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పనులను శరవేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు, నాయకులు,ప్రజాప్రతినిధులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM