Amalapuram: బీబీసీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థులతో ఎమ్మెల్యే ముఖాముఖి

Amalapuram: అమలాపురంలో బీబీసీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన ఎమ్మెల్యే ఆనందరావు. పారదర్శక నియామకాలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టత.

SURESH, AMALAPURAM
Published on: 17 Sept 2026 6:39 AM IST
Amalapuram
X

Amalapuram: బీబీసీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థులతో ఎమ్మెల్యే ముఖాముఖి

అమలాపురం: రాష్ట్రంలో విద్యార్థులు,నిరుద్యోగ యువత భవిష్యత్తుకు పూర్తి రక్షణ కల్పిస్తూ,పారదర్శకంగా ప్రతిభ ఆధారిత ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కూటమి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ప్రత్యేక చొరవ మరియు సమర్థవంతమైన నాయకత్వంలో రూపొందించిన "యువత భవిష్యత్తుకు భరోసా" కార్యక్రమంలో భాగంగా అమలాపురం పట్టణం,గొల్లగూడెం లోని బిబిసి (BBC) కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎమ్మెల్యే సందర్శించి టౌన్ హాల్ సమావేశం (విద్యార్థులతో ముఖాముఖి) నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ,యువత నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో కనీసం ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని మండిపడ్డారు.

కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని భారీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి వేలాది ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసి,నిరుద్యోగ యువత కలలను నిజం చేశారు అని కొనియాడారు. గత వైఎస్సార్సీపీ పాలనలో సుమారు రూ.150 కోట్ల మేర ఉద్యోగ కుంభకోణం జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు.డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు రూ. 2.5 కోట్లు, ఆర్డీఓ పోస్టుకు రూ. 1 కోటి, డీఎస్పీ పోస్టుకు రూ. 50 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం ఉందన్నారు.

ముఖ్యంగా 2018 APPSC గ్రూప్-1 నియామకాల్లో జవాబు పత్రాల నిర్వహణలో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయని,ఒరిజినల్ పత్రాలను ప్రభుత్వ స్ట్రాంగ్ రూమ్ నుంచి ప్రైవేట్ రిసార్ట్‌కు తరలించి 84 రోజుల పాటు అక్కడే ఉంచారని విమర్శించారు.ఫోరెన్సిక్ పరీక్షల్లో మొత్తం 736 పత్రాలకు గానూ 718 (97.55%) పత్రాల్లో అనధికార దిద్దుబాట్లు జరిగినట్లు తేలిందని వివరించారు.

గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి సిద్ధపడ్డ లక్షలాది మంది యువ అభ్యర్థుల ఆశలను అమ్ముకున్నారని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువత నమ్మకాన్ని పూర్తిస్థాయిలో నిలబెడతారని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.ఎటువంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా,కేవలం ప్రతిభ ఆధారంగానే నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు.

సెప్టెంబర్ 16 నుండి 29 వరకు మంత్రి లోకేష్ మార్గదర్శకత్వంలో నిర్వహించే ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని కోచింగ్ సెంటర్లు, విద్యాలయాలను సందర్శించి విద్యార్థులకు ధైర్యాన్ని కల్పిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిబిసి ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, అధ్యాపకులు,పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM