Amalapuram: జనుపల్లిలో నీటమునిగిన పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఆనందరావు

Amalapuram: అమలాపురం నియోజకవర్గం జనుపల్లిలో నీటమునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే ఆనందరావు పరిశీలించారు. గత వైకాపా అశాస్త్రీయ వంతెన నిర్మాణమే కారణమని మండిపడ్డారు.

SURESH, AMALAPURAM
Published on: 2 Oct 2026 9:22 PM IST
Amalapuram
X

Amalapuram: జనుపల్లిలో నీటమునిగిన పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఆనందరావు

అమలాపురం: అశాస్త్రీయ వంతెన నిర్మాణాన్ని అడ్డుకున్న పాపానికి అప్పట్లో రైతులపై కేసులు పెట్టి వేధించిన గత వైకాపా ప్రభుత్వం అని ఎమ్మెల్యే అన్నారు.వైకాపా నాయకుడు పినిపే శ్రీకాంత్ చౌకబారు రాజకీయాన్ని తిప్పికొట్టిన జనుపల్లి రైతులు. స్వయంగా క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి,కలెక్టర్ మరియు ఇరిగేషన్ అధికారులను సమన్వయం చేసిన అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జనుపల్లి గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.దెబ్బతిన్న పంటను చూసి,బాధిత రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కి ఫోన్ చేసి మాట్లాడటంతో పాటు ఇరిగేషన్ అధికారులను వెంటనే పరిశీలించమని, డ్రైనేజీ అవరోధాలను తొలగించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

ఇటీవల వైకాపా నియోజకవర్గ ఇన్‌చార్జ్ పినిపే శ్రీకాంత్ జనుపల్లి వచ్చి,డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేదని,దీనికి ఎమ్మెల్యే ఆనందరావు మరియు కూటమి ప్రభుత్వమే కారణమంటూ రైతులను విచారించి చౌకబారు రాజకీయం చేసే ప్రయత్నం చేశారు.ఆయన మాటలు నమ్మి తొందరపాటులో ఎమ్మెల్యే ని విమర్శించిన ఒక రైతు.ఈరోజు స్వయంగా ఎమ్మెల్యే ఆనందరావు పొలాల్లోకి వచ్చి పరిశీలిస్తున్నప్పుడు ఆయన వద్దే ఉండి అసలు నిజాలను వెల్లడించారు.

పరిశీలన సమయంలో వైకాపా చేసిన దారుణాలు బయటపడ్డాయి.గత వైకాపా ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన పినిపే విశ్వరూప్ స్వార్థం,అశాస్త్రీయ ఆలోచనల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నడిపూడి రోడ్డులోని మురుగు కాలువపై నీరు కిందకు వెళ్లకుండా ఎంతో కిందకు ఆ వంతెనను నిర్మించడమే కాకుండా, ప్రవాహానికి అడ్డుగా తూరాళ్ళు వేయడంతోనే మురుగునీరు వెనక్కి తన్ని పొలాలు మునిగిపోయాయని తేలింది.

అప్పట్లో ఈ అశాస్త్రీయ వంతెన నిర్మాణం వల్ల భవిష్యత్తులో తమ పొలాలు మునిగిపోతాయని అడ్డుకున్నందుకు.వైకాపా ప్రభుత్వం తమపై అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా వేధించిందని స్థానిక రైతులు ఎమ్మెల్యే ఆనందరావు వద్ద కన్నీళ్ల పర్యంతమయ్యారు.నాడు అక్రమ కేసులు పెట్టి వేధించి,మురుగు నీరు పోకుండా వంతెన కట్టి రైతుల పొలాలను ముంచిన వైకాపా నేతలు.

ఈరోజు దొంగ ఏడ్పులు ఏడుస్తూ నాటకాలు ఆడటం సిగ్గుచేటని మండిపడ్డారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ"గత వైకాపా ప్రభుత్వం చేసిన పాపాలను,అశాస్త్రీయ నిర్మాణాలను సరిదిద్ది రైతులకు న్యాయం చేసే బాధ్యతను మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం" అని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, కూటమి నాయకులు,పంచాయతీ ప్రతినిధులు మరియు ఇరిగేషన్ అధికారులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM