Amalapuram: అమలాపురం ప్రమాద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది!

Amalapuram: అమలాపురంలో భారీ విస్ఫోటన స్థలాన్ని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పరిశీలించి, బాధితులకు అండగా ఉంటామని భరోసానిస్తూ ఫోరెన్సిక్ దర్యాప్తునకు ఆదేశించారు

SURESH, AMALAPURAM
Published on: 20 Sept 2026 9:36 AM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురం ప్రమాద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది!

Amalapuram: భారీ శబ్ద దాటికి ఎగిరిపడ్డ యువకులు ఒకరికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు,వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు. గ్యాస్ సిలిండర్ పేలుడా? పిడుగుపాటా? నిగ్గు తేల్చే పనిలో ఫైర్,పోలీస్ అధికారులు, రంగంలోకి రాజమండ్రి ఫొరెన్సిక్ నిపుణులు విస్ఫోటనంపై ముమ్మర దర్యాప్తు చెప్పటారు.

ఈ రోజు అమలాపురం పట్టణంలోని మహిపాల వీధిలో ఎం.ఎస్.ఎన్. మూర్తి (మలిశెట్టి మూర్తి మాస్టర్) నివాసంలో ప్రమాదం సంభవించినట్లు తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.ప్రమాద తీవ్రతను, ధ్వంసమైన ఇంటిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ ప్రమాదంలో ఇంటి కిటికీలు ఊడి దూరంగా పడిపోగా,పై అంతస్తులోని బెడ్ రూమ్‌లో ఉన్న మూర్తి మాస్టర్ ఇద్దరు కుమారులు తీవ్ర శబ్దానికి బయటకు ఎగిరిపడ్డారు. గాయపడిన ఒక యువకుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ లేకపోవడం, ప్రాంతమంతా చీకటిగా ఉండటంతో నష్టం అంచనా వేయడం ప్రస్తుతం కష్టంగా మారింది.సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే బాధితులైన మూర్తి మాస్టర్ కుమారులతో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కొండంత అండగా ఉంటుందని,తక్షణ సహాయక చర్యలతో పాటు పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని ఎమ్మెల్యే బాధితులకు ధైర్యం చెప్పారు.

ఈ ప్రమాదానికి గ్యాస్ సిలిండర్ పేలుడు కారణమా లేక పిడుగు పడటం వల్ల జరిగిందా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని ఫైర్ అధికారులు తెలిపారు.విస్ఫోటనం వెనుక ఉన్న అసలు కారణాలను నిగ్గు తేల్చేందుకు రాజమండ్రి నుంచి ఫొరెన్సిక్ నిపుణులు రానున్నారు అని పట్టణ సీఐ బృందం ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు వేగవంతం చేయాలి అని ఎమ్మెల్యే అధికారులను కోరారు.ఈ సంఘటనలో ఎమ్మెల్యే వెంట కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM