Amalapuram: టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్
Amalapuram: అమలాపురంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త బుడితి బాలకృష్ణ కుటుంబానికి ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ పత్రాలు అందజేశారు.
Amalapuram: టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్
అమలాపురం: తెలుగు దేశం పార్టీ కష్టకాలంలో పార్టీ కోసం శ్రమించిన ప్రతి కార్యకర్త కుటుంబానికి తెలుగుదేశం పార్టీ సర్వవేళలా అండగా ఉంటుందని అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు స్పష్టం చేశారు.
అమలాపురం రూరల్ మండలం ఏ.వేమవరం గ్రామానికి చెందిన పార్టీ దివంగత కార్యకర్త బుడితి బాలకృష్ణ అకాల మరణంతో,వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి ద్వార మంజూరైన ₹5,00,000 (ఐదు లక్షల రూపాయల) ప్రమాద భీమా క్లెయిమ్ పత్రాలను వారి తండ్రి గారికి ఎమ్మెల్యే ఆనందరావు స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు గారు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రవేశపెట్టిన ఈ ఇన్సూరెన్స్ సభ్యత్వ కార్యక్రమం కష్టాల్లో ఉన్న ఎన్నో కార్యకర్తల కుటుంబాలకు ఆపద్బాంధవుడిలా కొండంత అండగా నిలుస్తోందని కొనియాడారు.లోకేష్ దూరదృష్టి వల్ల ఈరోజు వేలాది కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక భద్రత చేకూరుతోందన్నారు.
ప్రాణ త్యాగాలు చేసినా,కష్టాల్లో ఉన్నా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడం తెలుగుదేశం పార్టీ సంప్రదాయమని, బుడితి బాలకృష్ణ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా తోడ్పాటునందిస్తుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు,కార్యకర్తలు గ్రామ ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




