Amalapuram: ప్రజల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే ఆనందరావు

Amalapuram: అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రజాదర్బార్ నిర్వహించారు.

SURESH, AMALAPURAM
Published on: 2 Oct 2026 4:15 PM IST
Amalapuram
X

Amalapuram: ప్రజల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే ఆనందరావు

అమలాపురం: స్థానిక అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రజాదర్బార్ (PGRS)కి .. తరలివచ్చిన ప్రజలు.ఈ రోజు అమలాపురం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రజాదర్బార్ (PGRS) కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు నిర్వహించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, పట్టణాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించిన ఎమ్మెల్యే సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు.ప్రజల సమస్యల పరిష్కారమే మన కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని ఎమ్మెల్యే ఆనంద్ రావు అన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM