Amalapuram: ఏకలవ్యుని విగ్రహానికి ఎమ్మెల్యే ఆనందరావు ఘన నివాళులు

Amalapuram: అమలాపురం మార్కెట్ కాలనీ ఎరుకల కులస్తుల చిరకాల కోరిక నెరవేరుస్తూ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కమ్యూనిటీ హాల్ నిధులు మంజూరు చేశారు.

SURESH, AMALAPURAM
Published on: 10 Oct 2026 4:20 PM IST
Amalapuram
X

Amalapuram: ఏకలవ్యుని విగ్రహానికి ఎమ్మెల్యే ఆనందరావు ఘన నివాళులు

Amalapuram: బలహీన వర్గాల అభ్యున్నతికే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు.అమలాపురం పట్టణంలోని మార్కెట్ కాలనీలో ఎరుకల కులస్తుల చిరకాల కోరిక నెరవేరుతూ వారి కోసం నూతన కమ్యూనిటీ హాల్‌ను మంజూరు చేసినట్లు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రకటించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు తొలుత ఏకలవ్యుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఎరుకల కులస్తులు తనను కోరిన విధంగా,ఇచ్చిన మాట ప్రకారం శనివారం కమ్యూనిటీ హాల్‌కు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.

ఉమ్మడి జిల్లాలో నాటి దివంగత నేత మెట్ల సత్యనారాయణ అమలాపురం పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఆయనను ఆదర్శంగా తీసుకుని తాను ఆయనకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపుతున్నానని స్పష్టం చేశారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకుని ప్రతీ ఒక్కరూ తమ పిల్లలను బాగా చదివించాలని,అన్ని రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతూ సమాజంలో ఆనందంగా రాణించాలని పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు రాష్ట్ర అభివృద్ధికి, అన్ని కులాలు మరియు బలహీన వర్గాల సంక్షేమానికి చేస్తున్న విశేష కృషిని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు.

ఎరుకల కులస్తుల అభ్యున్నతికి కమ్యూనిటీ హాల్ మంజూరు చేసిన మాదిరిగానే, భవిష్యత్తులోనూ కూటమి ప్రభుత్వం మీకు అన్ని విధాలా అండగా ఉంటుందని,రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి కృతజ్ఞత చాటుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి కార్యకర్తలు,నాయకులు,ప్రజాప్రతినిధులు, ఎరుకల కుల సంఘ నాయకులు మరియు అధికసంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM