Amalapuram: అమలాపురంలో రూ.30 లక్షలతో ఆధునీకరించిన ఫిష్ మార్కెట్ ప్రారంభం

Amalapuram: అమలాపురం 26వ వార్డులో రూ.30 లక్షల మెప్మా నిధులతో ఆధునీకరించిన అత్యాధునిక ఫిష్ మార్కెట్‌ను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు.

SURESH, AMALAPURAM
Published on: 28 Sept 2026 8:53 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో రూ.30 లక్షలతో ఆధునీకరించిన ఫిష్ మార్కెట్ ప్రారంభం

Amalapuram: మత్స్యకారులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు ప్రజలపట్ల ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి అని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. మత్స్యకార సోదరీమణుల కోసం ఫిష్ మార్కెట్ ఆధునీకరించిన ఎమ్మెల్యే ఆనందరావు మత్స్యకార మహిళలలు జైజైలు పలుకుతూ కృతజ్ఞతలు తెలిపారు.

అమలాపురం పురపాలక సంఘం 26వ వార్డు పరిధిలో మెప్మా (MEPMA) నిధులు రూ. 30.00 లక్షల వ్యయంతో నూతనంగా ఆధునీకరించిన ఫిష్ మార్కెట్‌ను అయితాబత్తుల ఆనందరావు ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ మా కూటమి ప్రభుత్వానికి అత్యంత ఆప్తులైన మత్స్యకార సోదరీమణుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ ఫిష్ మార్కెట్‌ను రూ. 30 లక్షలతో మోడ్రనైజ్ చేసి సకల సౌకర్యాలతో తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మత్స్యకారులపై ప్రత్యేకమైన ప్రేమ,అభిమానాలు ఉన్నాయని,వారి ఆర్థికాభివృద్ధికి,వ్యాపార పురోగతికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో అమలాపురం నియోజకవర్గంలో మరెన్నో అభివృద్ధి పనులను చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.కాగా,ఎన్నో ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులను గుర్తించి తమ కోసం ఇంతటి మోడ్రన్ ఫిష్ మార్కెట్‌ను అందుబాటులోకి తెచ్చినందుకు స్థానిక మత్స్యకార మహిళలు తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే ఆనందరావుకి,కూటమి ప్రభుత్వానికి,అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మత్స్యకార మహిళలు జై జైలు పలుకుతూ తమ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పురపాలక సంఘ ప్రతినిధులు, పట్టణ కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు మరియు స్థానిక ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM