Amalapuram: గోపవరంలో రాజముద్ర పాసుపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
Amalapuram: అమలాపురం నియోజకవర్గం గోపవరంలో రైతన్నలకు రాజముద్ర పాసుపుస్తకాలను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పంపిణీ చేసి, భూ భద్రత కల్పిస్తున్నామన్నారు.
Amalapuram: గోపవరంలో రాజముద్ర పాసుపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
అమలాపురం: గోపవరంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. రైతుల భూములకు భద్రత,చట్టబద్ధత కల్పిస్తున్న కూటమి ప్రభుత్వానికి జేజేలు కొడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.
ఉప్పలగుప్తం మండలం,గోపవరం గ్రామంలో అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాజకీయ నాయకుల బొమ్మలతో ఇచ్చిన పాసుపుస్తకాల వల్ల రైతులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని పేర్కొన్నారు. భూ యజమానులకు పూర్తి భద్రత మరియు చట్టబద్ధత కల్పిస్తూ, రాజముద్రతో కూడిన పత్రాలను అందించాలనే హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు.
రైతుల హక్కులకు భంగం కలగకుండా, పారదర్శక రికార్డులతో ప్రతీ రైతుకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు,కూటమి ప్రజాప్రతినిధులు మరియు గ్రామ రైతులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




