Amalapuram: వసతి గృహ విద్యార్థినులకు 'రుతురుమాళ్ల' పంపిణీ
Amalapuram: అమలాపురంలో వసతి గృహ విద్యార్థినులకు ఓఎన్జీసీ సహకారంతో ఏడాదికి సరిపడా రుతురుమాళ్ల పంపిణీ. వివరాలు వెల్లడించిన అధికారులు, ఎమ్మెల్యే అభినందన.
Amalapuram: వసతి గృహ విద్యార్థినులకు 'రుతురుమాళ్ల' పంపిణీ
అమలాపురం: జిల్లాలోని సాంఘిక సంక్షేమ,బిసి వసతి గృహాల విద్యార్థినుల కోసం ప్రత్యేక కార్యక్రమలు ఏర్పాటు చేస్తున్నారు. పీ-4 (P-4) కార్యక్రమంలో భాగంగా ఓఎన్జీసీ (ONGC) సహకారంతో ఏర్పాట్లు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ని కలిసి వివరాలు వెల్లడించిన అధికారులు.
ఈ రోజు స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ,వెనుకబడిన తరగతుల (BC) వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు ఉచితంగా 'రుతురుమాళ్లు' (Menstrual Hygiene Kits) పంపిణీ చేస్తున్నట్లు జిల్లా గణాంక శాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు.
ఓఎన్జీసీ (ONGC) నిధుల సహకారంతో చేపట్టిన ఈ పీ-4 కార్యక్రమంలో భాగంగా మొత్తం 10 వసతి గృహాల్లోని 600 మంది విద్యార్థినులకు ఏడాదికి సరిపడా రుతురుమాళ్లను పంపిణీ చేయనున్నారు.ఈ విషయమై సోమవారం జిల్లా అధికారుల బృందం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి,ఈ పంపిణీ కార్యక్రమం వివరాలను మరియు కిట్లను చూపించారు.
విద్యార్థినుల ఆరోగ్య భద్రత,పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో సహాయ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు భగవాన్ (ASWO), సంబంధిత వసతి గృహాల వార్డెన్లు,అలాగే విజన్ 2047 (Vision 2047) టీమ్ సభ్యులు సిహెచ్. వి.రావు విజయ్ ఇతర ప్రముఖులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.




