Amalapuram: కొడపలో టీడీపీలోకి భారీ చేరికలు.. కండువా కప్పిన ఎమ్మెల్యే
Amalapuram: అల్లవరం మండలం కొమరగిరిపట్నం కొడపలో ఎస్సీ, బీసీ వర్గాల ప్రజలు భారీగా టీడీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కండువాలు కప్పారు.
Amalapuram: కొడపలో టీడీపీలోకి భారీ చేరికలు.. కండువా కప్పిన ఎమ్మెల్యే
Amalapuram: తెలుగు దేశం పార్టీ చేరిన భారీగా ఎస్సీ,బీసీ వర్గాల చేరిక పార్టీ కండువా కప్పిన అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.త్రాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం కొడప చేరికల సభలో భరోసానిచ్చిన ఎమ్మెల్యే ఆనందరావు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు యువనేత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పాలన,అభివృద్ధి విప్లవానికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి.
ఇందులో భాగంగా,అల్లవరం మండలం కొమరగిరిపట్నం (కొడప) గ్రామం నుంచి అధిక సంఖ్యలో ఎస్సీ, బీసీ వర్గాల ప్రజలు మరియు యువకులు మద్దతు తెలిపి తెలుగుదేశం పార్టీలో అధికారికంగా చేరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు స్వయంగా విచ్చేసి, కొత్తగా పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి లోకేష్ బాబు ముందుచూపు పాలన,ప్రజా సంక్షేమ పథకాలు, మరియు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆనందరావు చేస్తున్న నిరంతర అభివృద్ధి కార్యక్రమాలే తమను పార్టీ వైపు ఆకర్షించాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులు తమ ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఎమ్మెల్యే ఆనందరావు దృష్టికి తీసుకురాగా,ఆయన సానుకూలంగా స్పందించి తక్షణమే ఆ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికే పెద్దపీట వేస్తుందని అన్నారు. కార్యకర్తలు,నాయకులు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ సిద్ధాంతాలను,ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,మంత్రి లోకేష్ పడుతున్న శ్రమను ప్రజలకు వివరించి,రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేయాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో గొల్లపల్లి సత్యనారాయణ,గొల్లపల్లి నరసింహమూర్తి,గుత్తుల సత్యనారాయణ,శెట్టిబత్తుల శిఖామణి,శెట్టిబత్తుల క్రాంతి, శెట్టిబత్తుల శ్రావణ్,మన్ని శ్రీనివాసరావు,శెట్టిబత్తుల మరియమ్మ,పెచ్చెట్టి రామలక్ష్మి, బుంగ అమల,కుసుమ మణిరత్నం,పి.చందర్రావు, భూపతి సాయి,వి.కిరణ్,కొనుకు వీరస్వామి,కాండ్రేగుల వెంకటలక్ష్మి,మట్టా మరియమ్మ, పి.సావిత్రి తదితరులు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కండువాలు తప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఆనందరావు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




