Amalapuram: పురాతన ఖబరస్థాన్‌కు వసతులు కల్పించాలి: ఎమ్మెల్యేకు వినతి
Amalapuram: అమలాపురంలోని 420 ఏళ్ల చరిత్ర కలిగిన ముల్లా ముస్తఫా మసీదు ఖబరస్థాన్‌లో సీసీ రోడ్డు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆనందరావుకు వినతిపత్రం ఇచ్చారు.
Amalapuram: పురాతన ఖబరస్థాన్‌కు వసతులు కల్పించాలి: ఎమ్మెల్యేకు వినతి
Amalapuram: సీసీ రోడ్డు,విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆనందరావుకు మసీదు కమిటీ వినతి.అమలాపురం పట్టణంలోని ప్రాచీన కాలంనాటి ముల్లా ముస్తఫా మసీదుకు అనుబంధంగా ఉన్న పురాతన ఖబరస్ధాన్లో (ముస్లిం స్మశాన వాటిక )మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ మసీదు కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును కలిసి వినతిపత్రం అందించారు.
కె.ఎన్.ఎఫ్.రోడ్డు పక్కన కుంకాల సందు వద్ద సుమారు 420 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఖబరస్ధాన్ ఎకరంన్నర విస్తీర్ణంలో ఉందని కమిటీ సభ్యులు తెలిపారు.అమలాపురం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ముస్లింల అంత్యక్రియలు ఇక్కడ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఖబర్స్తాన్( ముస్లిం స్మశాన వాటిక) లో పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు పెరిగిపోవడంతో పాటు విషపురుగుల సంచారం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.
ఖబరస్ధాన్లోకి వెళ్లేందుకు సుమారు 200 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో సీసీ రోడ్డు నిర్మించాలని,రాత్రి వేళల్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేనువారు కోరారు. అవసరమైన నిధులు మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఖబరస్ధాన్ కమిటీ మహమ్మద్ వలీ, మొహిద్దిన్,జిఎం ఖాన్,ఎస్ లాల్, కమిటీ సభ్యులు పాటు మొహమ్మద్ బషీర్, పాల్గొన్నారు.




