Amalapuram: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి: వామపక్షాల డిమాండ్

Amalapuram: రాజ్యాంగబద్ధమైన ఎన్నికల వ్యవస్థను దెబ్బతీస్తున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని అమలాపురంలో వామపక్షాలు నిరసన చేపట్టాయి.

SURESH, AMALAPURAM
Published on: 28 Sept 2026 7:39 PM IST
Amalapuram
X

Amalapuram: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి: వామపక్షాల డిమాండ్

Amalapuram: ​రాజ్యాంగబద్ధమైన ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి తక్షణమే తొలగించాలని సిపిఎం, సిపిఐ,వామపక్ష,హక్కుల,ప్రజా సంఘాల నాయకులు ఉమ్మడిగా డిమాండ్ చేశారు.ఈ మేరకు అమలాపురంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద నాయకులు ఈ రోజులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.​

ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం,రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు,సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు కే సత్తిబాబు,మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి కె రవి ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే తీవ్ర ప్రమాదకరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సూచనలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా 'సర్' (SIR) పేరుతో దాదాపు 13 కోట్ల ఓట్లను తొలగించారని మండిపడ్డారు.

అధికార పక్షం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నా ఎన్నికల సంఘం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని,విపక్షాల అభ్యంతరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ సంస్థ అధికార పక్షానికి అనుకూలంగా పనిచేస్తూ తన విశ్వసనీయతను కోల్పోయిందని,జ్ఞానేశ్ కుమార్ ను తొలగిస్తే తప్ప ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని స్పష్టం చేశారు.

ఏకపక్ష నిర్ణయాలతో ఓటర్ల హక్కులను కాలరాసిన జ్ఞానేశ్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని,కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు . సర్' పేరుతో జరిగిన ఓట్ల తొలగింపుపై స్వతంత్ర దర్యాప్తు సంస్థచే సమగ్ర విచారణ జరిపించాలి డిమాండ్ చేశారు 2023లో తీసుకువచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి.ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి కేంద్ర క్యాబినెట్ మంత్రిని తొలగించి, ఆ స్థానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి (CJI) ప్రాతినిధ్యం కల్పించాలి. ఓట్ల అక్రమాల ద్వారా,ఓట్ చోరీ ఆధారంగా జరిగిన అన్ని ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు,పౌర హక్కుల సంఘం నాయకులు అమలుదాసు బాబురావు, జిల్లెల్ల మనోహర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,పిడిఎం నాయకులు శివప్రసాద్,ఏపీ ఆర్ పి ఏ రాష్ట్ర కోశాధికారి ఎం వెంకటేశ్వరరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి,ఏ టి యు సి జిల్లా నాయకులు వాసంశెట్టి సత్తిరాజు ఊటాల వెంకటేష్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పీతల రామచంద్రరావు,సఖి సూర్యనారాయణ,పాము బాలయ్య,ఇసుకపట్ల మంగాదేవి,ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ శంకర్,కే కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM