Amalapuram: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు పక్షాల డిమాండ్
Amalapuram: అమలాపురంలో వామపక్షాలు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించాలని నాయకులు డిమాండ్ చేశారు.
Amalapuram: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు పక్షాల డిమాండ్
అమలాపురం: రాజ్యాంగబద్ధమైన ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి తక్షణమే తొలగించాలని సిపిఎం, సిపిఐ,కాంగ్రెస్ హక్కుల,ప్రజా సంఘాల నాయకులు ఉమ్మడిగా డిమాండ్ చేశారు.ఈ మేరకు అమలాపురం స్థానిక సిఐటియు కార్యాలయం నందు రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడటం జరిగింది. సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు కే సత్తిబాబు అధ్యకతన సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు,సిపిఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్,సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు,కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొత్తూరి శ్రీను మాట్లాడుతూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే తీవ్ర ప్రమాదకరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సూచనలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా 'సర్' (SIR) పేరుతో దాదాపు 13 కోట్ల ఓట్లను తొలగించారని మండిపడ్డారు.అధికార పక్షం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నా ఎన్నికల సంఘం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని, విపక్షాల అభ్యంతరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ సంస్థ అధికార పక్షానికి అనుకూలంగా పనిచేస్తూ తన విశ్వసనీయతను కోల్పోయిందని,జ్ఞానేశ్ కుమార్ ను తొలగిస్తే తప్ప ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని స్పష్టం చేశారు.
ఏకపక్ష నిర్ణయాలతో ఓటర్ల హక్కులను కాలరాసిన జ్ఞానేశ్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని,కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు . సర్' పేరుతో జరిగిన ఓట్ల తొలగింపుపై స్వతంత్ర దర్యాప్తు సంస్థచే సమగ్ర విచారణ జరిపించాలి డిమాండ్ చేశారు 2023లో తీసుకువచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి.ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి కేంద్ర క్యాబినెట్ మంత్రిని తొలగించి, ఆ స్థానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి (CJI) ప్రాతినిధ్యం కల్పించాలి.ఓట్ల అక్రమాల ద్వారా,ఓట్ చోరీ ఆధారంగా జరిగిన అన్ని ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా లో సోమవారం వామపక్షాలు,కాంగ్రెస్,ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో విస్తృతంగా సమావేశం నిర్వహిస్తామని సర్ ప్రక్రియ రద్దు చేయాలనీ వారం రోజులు పాటు ప్రచారo నిర్వహించడం జరుగుతుంది అని రౌండ్ టేబుల్ సమావేశం లో తీర్మానం చేసారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జి. దుర్గాప్రసాద్,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి సత్తిరాజు, ఉటాల వెంకటేష్,కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు బుంగసత్యనారాయణ,APRPA రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వరరావు, పిడిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దీపాటి శివప్రసాద్, చెల్లుబోయిన.తాతారావు,దేవ సురేష్ బాబు, పి.ఆనంద్,ఆకన నాగేశ్వరరావు,బత్తుల రవిప్రసాద్ అధికసంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.




