Amalapuram: అమలాపురం కిమ్స్‌లో అత్యాధునిక క్యాన్సర్ వైద్య సేవలు ప్రారంభం
Amalapuram: అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో అత్యుత్తమ క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి రావడం శుభపరిణామమని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు.
Amalapuram: అమలాపురం కిమ్స్‌లో అత్యాధునిక క్యాన్సర్ వైద్య సేవలు ప్రారంభం
Amalapuram: ఈ రోజు అమలాపురంలోని కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) ఆసుపత్రిలోని ఆంకాలజీ (క్యాన్సర్) విభాగాన్ని ప్రజాప్రతినిధులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు ఈ రోజు సాయంత్రం సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా కిమ్స్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ కె.వి.వి.సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) ప్రజాప్రతినిధులను ఆసుపత్రిలోని వివిధ విభాగాలకుతీసుకెళ్లి,క్యాన్సర్ బాధితులకు అందిస్తున్న ప్రత్యక్ష వైద్య సేవలను చూపించారు.
అందుబాటులో ఉన్న అత్యాధునిక రేడియేషన్, సర్జికల్,మెడికల్ ఆంకాలజీ విభాగాలు,నూతన సాంకేతిక పరికరాల (ఎక్విప్మెంట్) పనితీరును,అందిస్తున్న ప్రత్యేక వైద్య విధానాలను ఆయన సమగ్రంగా వివరించారు.
ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ
"కోనసీమ పరిసర ప్రాంతాల ప్రజలు క్యాన్సర్ చికిత్స కోసం గతంలో దూర ప్రాంతాలకు,పెద్ద నగరాలకు వెళ్లాల్సి వచ్చేది.కానీ ఇప్పుడు మన అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రిలోనే అత్యంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రేడియేషన్,సర్జికల్,మెడికల్ ఆంకాలజీ వైద్యం అందుబాటులోకి రావడం ఎంతో సంతోషకరం.
గ్రామీణ,పట్టణ ప్రాంత ప్రజలకు ఈ సేవలు ఎంతో మేలు చేకూరుస్తాయి" అని పేర్కొన్నారు.ప్రాంతీయ ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన ఉచిత,రాయితీ క్యాన్సర్ వైద్యం అందిస్తున్నందుకు కిమ్స్ అధినేత డాక్టర్ చైతన్య రాజు ని , ఆసుపత్రి యాజమాన్యాన్ని, వైద్య బృందాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు,వివిధ పార్టీల ముఖ్య నాయకులు,కిమ్స్ ఆసుపత్రి ప్రతినిధులు,వైద్యులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




