Amalapuram: గాంధీ జయంతి రోజే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు

Amalapuram: అమలాపురం రూరల్ మండలం పేరూరులో గాంధీ జయంతి రోజే మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికుల ఆరోపణ.

SURESH, AMALAPURAM
Published on: 2 Oct 2026 10:08 PM IST
Amalapuram
X

Amalapuram: గాంధీ జయంతి రోజే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు

అమలాపురం: అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామంలోని తాడికుంట మెరక పాన్ షాప్ లలో మద్యం అమ్మకాలు. అధికారులు సోద్యం చూస్తున్నారన్న విమర్శలు చేస్తున్న స్థానిక ప్రజలు. గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలపై నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ,అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామంలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి.

పేరూర్రు గ్రామంలోని తాడికుంట చెరువు లోని ఒక పాన్ షాప్ లో మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.గాంధీ జయంతి వంటి ప్రత్యేక రోజున కూడా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయన్న విషయం అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ,తగిన చర్యలు తీసుకోకుండా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు.

కూటమి ప్రభుత్వ నిబంధనల ప్రకారం డ్రై డేగా పరిగణించే రోజుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయా జరిగితే వాటికి ఎవరిఅనుమతిలు ఉన్నాయా అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.సంబంధిత అధికారులు తక్షణమే తనిఖీలు నిర్వహించి,నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిగినట్లుతేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM