Amalapuram: కోటిపల్లి - నరసాపురం రైల్వే లైన్ నిధుల విడుదల స్వాగతం
Amalapuram: కోటిపల్లి - నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు విడుదల చేయడం అభినందనీయమన్నారు మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు. రాబోయే మూడేళ్లలో పూర్తి చేయాలని కోరారు.
Amalapuram: కోటిపల్లి - నరసాపురం రైల్వే లైన్ నిధుల విడుదల స్వాగతం
అమలాపురం: అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు డా.పి.రవీంద్ర బాబు కోటిపల్లి - నరసాపురం రైల్వే లైన్ నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పండుల రవీంద్రబాబు తెలిపారు.
ఈ మేరకు ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వాలు రాబోయే మూడేళ్లలో ఈ రైల్వే లైన్ పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఆయన కోరారు.
2014-19 మధ్య తాను పార్లమెంటు సభ్యునిగా ఉన్న సమయంలో ఈ రైల్వే లైనుకు అత్యధిక నిధులను మంజూరు చేయించడం జరిగిందన్నారు.సుమారు రూ.680 కోట్లతో గౌతమి,వైనతేయ , వశిష్ఠ గోదావరి పాయలపై బ్రిడ్జీల నిర్మాణ పనులు వేగవంతం చేయడం జరిగిందన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ రైల్వే లైన్ నిర్మాణాన్ని ప్రస్తుత ప్రభుత్వం గత రెండేళ్లుగా విస్మరించినప్పటికీ ఇప్పటికైనా నిధులు మంజూరు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వాటాగా గతంలో నిర్ణయించిన 250 కోట్లకు గాను,కేవలం రూ.100 కోట్లు మాత్రమే ప్రస్తుతం మంజూరు చేయడం జరిగిందని,పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ వాటాను మంజూరు చేస్తే రైల్వే లైన్ త్వరితగతిన పూర్తయ్యేందుకు మార్గం సుగమం కాగలదని ఆయన అన్నారు.రాబోయే మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుండి మరిన్ని నిధులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.




