Amalapuram: గెడ్డం సంపత్ రావు మృతికి దళిత సేన ఘన నివాళి

Amalapuram: బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్, ప్రముఖ న్యాయవాది గెడ్డం సంపత్ రావు అకాల మృతికి అమలాపురంలో దళిత సేన ఘనంగా నివాళులర్పించింది.

SURESH, AMALAPURAM
Published on: 10 Oct 2026 8:31 PM IST
Amalapuram
X

Amalapuram: గెడ్డం సంపత్ రావు మృతికి దళిత సేన ఘన నివాళి

Amalapuram: అమలాపురం నియోజకవర్గం టౌన్ పరిధి స్థానిక బుపయ్య అగ్రహారం నందు దళిత సేన ఆధ్వర్యంలో ప్రముఖ న్యాయవాది బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గెడ్డం సంపత్ రావు ని స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సంతాపం తెలియజేశారు.

దళిత సేన చైర్మన్ మెండి డేవిడ్ అంబేద్కర్ మాట్లాడుతూ నిరంతరం నీలి జెండాని భుజం మీద వేసుకుంటూ పల్లె పల్లెకు గడపగడపకు వెళ్లి అంబేద్కర్ స్ఫూర్తితో కాన్సిరాం రాజకీయ విశ్లేషణ మాయావతి సిద్ధాంతాలతో బహుజన సమాజ్ పార్టీని ముందుకు తీసుకువెళ్లారు.

అంతేకాకుండా ఎక్కడ అన్యాయం జరిగిన ప్రజా సంఘాలతో పాటు ప్రజా గొంతుకై గంభీరమైన స్వరముతో బహుజన పక్షాన నిలిచారు. దురదృష్టవశాత్తు ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా అలుపెరగని పోరాటం చేసి అక్టోబర్ 7 తేదీన కిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ చివరి శ్వాస విడిచారు.ఆయన లేని లోటు కేవలం బహుజన సమాజ పార్టీకి మాత్రమే కాదు అణగారిన వర్గాల అందరికీ తీరని లోటే ఆయన ఆశలను కొనసాగిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో దళిత సేన చైర్మన్ మెండి డేవిడ్ అంబేద్కర్,దళిత సేన అధ్యక్షులు వాకపల్లి హరీష్,దళిత సేన ట్రెజరర్ సాపే రమేష్,దళిత సేన జాయింట్ సెక్రెటరీ తానంకి వసంత్ కుమార్,దళిత సేన సభ్యులు మర్రి సాయి వికాస్,గోసంగి సంతోష్,ఎన్.డి. ప్రసాద్,పొలమురి సందీప్, బాలు,కమిడి సామ్యూల్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM