Amalapuram: కొబ్బరి చెట్టు వంతెనపై శవంతో అంతిమ యాత్ర

Amalapuram: అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడిలో వంతెన లేక కొబ్బరి చెట్టుపై శవాన్ని తీసుకెళ్తున్న హృదయవిదారక ఘటనపై ప్రభుత్వం స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

SURESH, AMALAPURAM
Published on: 6 Oct 2026 7:40 PM IST
Amalapuram
X

Amalapuram: కొబ్బరి చెట్టు వంతెనపై శవంతో అంతిమ యాత్ర

అమలాపురం: ప్రభుత్వం స్పందించాలని వీరయ్యపేట ప్రజల ఆవేదన వంతెన పనులు పూర్తి కాకపోవడం తో ప్రమాదకరం అయినా కొబ్బరికాయ చెట్టుతో వేసిన వంతెన పై శవాన్ని తీసుకుని వెళ్తున్న సంఘటన.

అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడి వీరయ్యపేట ఈ సంఘటన చోటుచేసుకుంది.చనిపోయిన పార్థివ దేహాన్ని వంతెన పై తీసుకువెళ్తున్న వీడియో గ్రామస్థులు లో కన్నీళ్లు రేకెత్తించాయి.ఒక మనిషి చివరి ప్రయాణం కూడా గౌరవంగా సాగించలేని పరిస్థితి మా గ్రామంలో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు .

ఒక మనిషి చివరి ప్రయాణం కూడా గౌరవంగా సాగించలేని పరిస్థితి మా గ్రామంలో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలనీ వీరయ్యపేట గ్రామస్థులు కోరుతున్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM