Amalapuram: అమలాపురంలో ఆర్నాబ్ తుఫాన్ ముందస్తు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు!
Amalapuram: అర్నబ్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు. కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ ఆదేశాలు.
Amalapuram: అమలాపురంలో ఆర్నాబ్ తుఫాన్ ముందస్తు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు!
Amalapuram: ప్రజలకు అందుబాటులో ఉండేలా జిల్లా,నియోజకవర్గ స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్‌తో పాటు అమలాపురం,రామచంద్రపురం, కొత్తపేట నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
తుఫాన్ ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, అత్యవసర పరిస్థితులు తలెత్తినా సంబంధిత కంట్రోల్ రూమ్‌లను సంప్రదించి సమాచారం అందించాలని అధికారులు సూచించారు.ప్రజల నుంచి అందే సమాచారంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేశారు.
కంట్రోల్ రూమ్‌ల ఫోన్ నంబర్లు:
క్రమ సంఖ్య| కంట్రోల్ రూమ్| ఫోన్ నంబర్
1| జిల్లా కలెక్టరేట్, కోనసీమ| 08856-293104
2| ఆర్డీఓ కార్యాలయం, అమలాపురం| 08856-233208
3| ఆర్డీఓ కార్యాలయం, రామచంద్రపురం| 08857-245166
4| ఆర్డీఓ కార్యాలయం, కొత్తపేట| 8500238258
5| ఆర్డీఓ కార్యాలయం, కొత్తపేట| 08855-244299
తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు,హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో సమీపంలోని కంట్రోల్ రూమ్‌ను సంప్రదించి సహాయం పొందాలని అధికారులు విజ్ఞప్తి చేసిన జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్.




